అయోమయం! | - | Sakshi
Sakshi News home page

అయోమయం!

Oct 1 2025 10:41 AM | Updated on Oct 1 2025 10:41 AM

అయోమయ

అయోమయం!

– 10లోu

న్యూస్‌రీల్‌

బుధవారం శ్రీ 1 శ్రీ అక్టోబర్‌ శ్రీ 2025
ఒకే ఒక్క ఓటు.. రిజర్వేషన్‌ మార్పు

ఒకటి రెండు కుటుంబాలున్న చోట రిజర్వేషన్‌

అభ్యర్థుల కోసం పార్టీల అన్వేషణ

సొంత కుటుంబాల నుంచే పోటీ

ఎటూ తేల్చుకోలేని పరిస్థితిలో ఓటర్లు

సాక్షి, మహబూబాబాద్‌:

జెడ్పీటీసీ, ఎంపీటీసీతో పాటు సర్పంచ్‌లు, వార్డు సభ్యుల ఎన్నికలకు ఎన్నికల కమిషన్‌ నగారా మోగించింది. రిజర్వేషన్లు అనుకూలంగా వస్తాయని భావించిన వారికి చుక్కెదురు కాగా.. అసలు రాజకీయాలే తెలియని వారు పోటీలో దిగే పరిస్థితి నెలకొంది. కాగా రాజకీయ పార్టీలు అభ్యర్థుల వేటలో పడ్డాయి. గెలుపు గుర్రాలకు టికెట్లు ఇచ్చే పనిలో ఉన్నాయి.

అంతా తారు మారు..

జిల్లాలో 482 గ్రామ పంచాయతీలు ఉన్నాయి. ఇందులో గంగారం, కొత్తగూడ, గార్ల, బయ్యారం, గూడూరు మండలాల్లోని పలు గ్రామాలు ఏజెన్సీ ప్రాంతంగా ఉన్నాయి. ఇందులో 103 గ్రామ పంచాయతీలు ఎస్టీలకే కేటాయించారు. అదే విధంగా తండాలు గ్రామ పంచాయతీగా రూపాంతరం చెందిన నేపథ్యంలో 133 గ్రామ పంచాయతీల్లో వంద శాతం ఎస్జీ జనాభా ఉంది. కావునా ఇవి ఎస్టీలకే కేటాయిస్తారు. ఇక మిగిలిన 246 మైదాన ప్రాంతం గ్రామాల్లో జనరల్‌ రిజర్వేషన్‌ కేటాయింపులు జరిగాయి. అయితే ఇందులో కొన్ని గ్రామాల్లో రొటేషన్‌ పద్ధతిన రిజర్వేషన్‌ తీయాల్సి వచ్చింది. ఈ పరిస్థితిలో కొత్త పంచాయతీలు కాకుండా.. పాత పంచాయతీలుగా ఉన్న పలు తండాల్లో ఒకటి రెండు కుటుంబాలు ఉన్నవారు.. నాలుగైదు ఓట్లే ఉన్న బీసీలకు, కొన్ని గ్రామాల్లో ఎస్సీలు, ఎస్టీలకు రిజర్వు అయ్యింది.

అభ్యర్థుల వేటలో పార్టీలు..

గ్రామాల్లో బలం పెంచుకునేందుకు అన్ని రాజకీయ పార్టీలు సిద్ధం అవుతున్నాయి. రిజర్వేషన్‌ ద్వారా కేటాయించిన సీట్లను ఆధారంగా చేసుకొని అభ్యర్థులను ఎంపిక చేసుకునే పనిలో ఉన్నారు. ఒకటి రెండు కుటుంబాలు ఉన్నచోట రిజర్వేషన్‌ రాగా వారు ఎక్కడ ఉంటున్నారు. వారిలో రాజకీయ పరిజ్ఞానం, క్యారెక్టర్‌ ఉన్నవారు ఎవరనేది చూస్తున్నారు. మంచి అభ్యర్థులు అయితే అన్ని పార్టీల వారు పోటీకి ఆహ్వానిస్తున్నారు. అదే విధంగా పోటీకి సిద్ధమై రిజర్వేషన్‌ అనుకూలించక భంగపడిన నాయకులు తమకు అనుకూలమైన వారిని బరిలో దింపేందుకు ప్రయత్నాలు ముమ్మరం చేశా రు. తాను చెప్పినట్లు వినే నాయకుడిని బరిలో దింపి గెలిపిస్తే తన పెత్తనమే సాగుతుందనే ఆలోచనతో పెద్ద నాయకులను ఒప్పించి టికెట్‌ తెచ్చుకునే పనిలో ఉన్నారు.

టికెట్‌ ఇవ్వండి ప్లీజ్‌..

అనుకూల రిజర్వేషన్లు వచ్చిన పంచాయతీలు, జెడ్పీటీసీలు, ఎంపీటీల స్థానాల్లో పోటీ చేసేందుకు టికెట్‌ ఇవ్వండి అని గాడ్‌ ఫాదర్స్‌ వద్దకు తిరుగుతున్నవారి సంఖ్య పెరుగుతోంది. అధికార కాంగ్రెస్‌ పార్టీలోని కొత్త, పాత నాయకులు తమ వర్గీయులకే టికెట్‌ ఇవ్వాలని నాయకులపై ఒత్తిడి తెస్తున్నారు. తమ అనుకూల నాయకులను వెంట తీసుకొని డీసీసీ అధ్యక్షులు, ఎమ్మెల్యేలు, ఎంపీల వద్దకు వెళ్తున్నారు. కులం, కుటుంబం, ఆర్థిక పరిస్థితులను వివరిస్తున్నారు. తమకు అనుకూలమైన వ్యక్తికి టికెట్‌ ఇస్తే ముందుగానే రూ.20లక్షలు ఖర్చుపెడుతామని ఒకరు అంటే.. కాదు రూ.40లక్షలు ఖర్చు పెడతామని మరొకరు పోటీపడుతున్నారు.

అయోమయం! 1
1/3

అయోమయం!

అయోమయం! 2
2/3

అయోమయం!

అయోమయం! 3
3/3

అయోమయం!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement