
మక్కలతో మార్కెట్ కళకళ
మహబూబాబాద్ రూరల్: మొక్కజొన్న కోతలు కొనసాగుతున్న నేపథ్యంలో మహబూబాబాద్ వ్యవసాయ మార్కెట్‌కు రైతులు అధిక మొత్తంలో మక్కలను విక్రయించేందుకు తీసుకువస్తున్నారు. పండుగ నేపథ్యంలో మార్కెట్‌కు సెలవులు ప్రకటించినప్పటికీ ముందస్తుగానే రైతులు మక్కలు తీసుకువచ్చి యార్డు ఆవరణలోని షెడ్లలో ఆరబోకుంటున్నారు. ప్రాంగణం మొ త్తం మక్కలతో కళకళలాడుతూ కనిపిస్తోంది.
రైల్వే స్టేషన్‌కు ఎస్కలేటర్ పరికరాలు
మహబూబాబాద్ రూరల్ : అమృత్ భారత్ పథకంలో భాగంగా మహబూబాబాద్ రైల్వే స్టేషన్ పరిధిలో ఎస్కలేటర్ నిర్మాణ పనులు జరుగుతున్నాయి. ఈమేరకు దానికి సంబంధించిన పరికరాలు మంగళవారం స్టేషన్‌కు చేరుకున్నాయి. ఒకటి, రెండో నంబర్ ప్లాట్‌ఫారాలపై నిర్మిస్తున్న ఎస్కలేటర్ కోసం అధునాతన సాంకేతిక పరిజ్ఞానంతో కూడిన పరికరాలను ప్రత్యేక వాహనంలో రైల్వే స్టేషన్‌కు సంబంధిత అధికారులు తీసుకువచ్చారు.
పోడుభూములకు
హక్కు పత్రాలు ఇవ్వాలి
గూడూరు : రైతులు సాగు చేసుకుంటున్న పోడు భూములకు ప్రభుత్వం వెంటనే హక్కు పత్రాలు ఇవ్వాలని సీపీఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యుడు జి.నాగయ్య డిమాండ్ చేశారు. మండల కేంద్రంలో మంగళవారం సీపీఎం ఆధ్వర్యంలో పోడు రైతుల సమావేశం వీరస్వామి అధ్యక్షతన నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఏజెన్సీ ప్రాంతాల్లోని రైతులు ఎన్నో ఏళ్లుగా పోడు సాగు చేసుకుంటూ జీవనం గడుపుతున్నారన్నారు. అలాంటి వారికి ఇప్పటి వరకు హక్కు పత్రాలు లేక ఎంతో ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. పోడు రైతులు హక్కు పత్రాలు లేక రైతుబంధు, రైతు బీమా, ప్రభుత్వ రాయితీలు అందడం లేదన్నారు. ఇప్పటికై నా పాలకులు వెంటనే పోడు రైతులకు పట్టాలు ఇవ్వాలని, లేనియెడల పోడు రైతులతో పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామని హెచ్చరించారు. కార్యక్రమంలో జిల్లా కార్యదర్శి సాదుల శ్రీనివాస్, నక్క సైదులు, పోడు భూములు సాదన సమితి కన్వీనర్ జనగం వీరస్వామి పాల్గొన్నారు.
స్థానిక సంస్థల ఎన్నికల బరిలో సీపీఐ
నెహ్రూసెంటర్: రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో సీపీఐ ఆఽభ్యర్థులు బరిలో ఉంటారని ఆ పార్టీ జిల్లా కార్యదర్శి బి.విజయసారథి తెలిపారు. జిల్లా కేంద్రంలోని వీరభవన్‌లో మంగళవారం పార్టీ మండల అత్యవసర సమావేశం జరిగింది. ఈ సందర్భంగా విజయసారథి మాట్లాడుతూ.. అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ విజయానికి దోహదం చేశామని, స్థానిక ఎన్నికల్లో కాంగ్రెస్‌తో కలిసి పోటీ చేసి గెలిచేందుకు సీపీఐ కృషి చేస్తుందని పేర్కొన్నారు. స్థానిక ఎన్నికల్లో జెడ్పీటీసీ, మూడు ఎంపీటీసీ, ఎనిమిది పంచాయతీల్లో బరిలో నిలిచేందుకు సమావేశంలో తీర్మానం చేశామని తెలిపారు. రానున్న ఎన్నికల్లో అభ్యర్థు గెలుపు కోసం ప్రతీ ఒక్కరు కృషి చేయాలని కోరారు. పార్టీ నియోజకవర్గ కార్యదర్శి బి.అజయ్‌సారథిరెడ్డి, పాండురంగాచారి, సందీప్, నారాయణ, కుమార్, వెంకన్న, లింగ్యా, సతీష్, శ్రీను, శేఖర్, వినయ్, గురుస్వామి పాల్గొన్నారు.

మక్కలతో మార్కెట్ కళకళ