
కేసముద్రం పోలీస్ సర్కిల్ ఏర్పాటు
● ఇనుగుర్తిలో పోలీస్‌స్టేషన్, ఏటీసీ సెంటర్ ఏర్పాటుకు ఉత్తర్వులు జారీ
కేసముద్రం: జిల్లాలోని కేసముద్రం పట్టణంలో నూతన సర్కిల్ పోలీస్‌స్టేషన్ ఏర్పాటు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వ ప్రత్యేక కార్యదర్శి రవిగుప్తా మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు. కాగా కేసముద్రం పోలీస్‌సర్కిల్ పరిధిలోకి మహబూబాబాద్ రూరల్ సర్కిల్ పరిధిలో ఉన్న కేసముద్రం పోలీస్‌స్టేషన్‌తోపాటు, కొత్తగా ఏర్పాటు చేసిన ఇనుగుర్తి పోలీస్‌స్టేషన్, తొర్రూరు సర్కిల్ పరిధిలోని నెల్లికుదురు పోలీస్‌స్టేషన్‌ను చేరుస్తూ జీఓ జారీ చేశారు. కాగా నూతనంగా ఏర్పాటైన ఇనుగుర్తి మండల కేంద్రానికి పోలీస్‌స్టేషన్, ఏటీసీ సెంటర్ మంజూరైంది. ఈమేరకు కేసముద్రం, ఇనుగుర్తి మండలాల్లో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో బాణసంచా పేలుస్తూ సంబురాలు జరుపుకున్నారు. సీఎం రేవంత్‌రెడ్డి, సీఎం సలహాదారు వేం నరేందర్‌రెడ్డి, ఎమ్మెల్యే మురళీనాయక్, ఎంపీ బలరాంనాయక్, డీసీసీ అధ్యక్షుడు భరత్‌చందర్‌రెడ్డి చిత్రపటాలకు పాలాభిషేకం చేశారు. కార్యక్రమాల్లో కేసముద్రం మార్కెట్ చైర్మన్ గంట సంజీవరెడ్డి, కాంగ్రెస్ పార్టీ రెండు మండలాల అధ్యక్షులు అల్లం నాగేశ్వర్‌రావు, కూరెల్లి సతీష్, జిల్లా ఉపాధ్యక్షుడు అంబటి మహేందర్‌రెడ్డి, గుగులోతు దస్రూనాయక్, రావుల మురళి, దయాకర్, వేముల శ్రీనివాస్‌రెడ్డి, చిదురాల వసంతరావు, వోలం రమేష్, ఎండి.అయూబ్‌ఖాన్, భూలోక్‌రెడ్డి, కొండ సురేష్, పోకల శ్రీను, చిన్నాల కట్టయ్య, రావుల మల్లేషం, అల్లం గణేష్ ఉన్నారు.