
రాజకీయ పార్టీలు సహకరించాలి
● కలెక్టర్ అద్వైత్‌కుమార్ సింగ్
మహబూబాబాద్: ఎంపీటీసీ, జెడ్పీటీసీ, సర్పంచ్ ఎన్నికల నిర్వహణకు అన్ని రాజకీయ పార్టీలు సహకరించాలని కలెక్టర్ అద్వైత్‌కుమార్ సింగ్ అన్నారు. కలెక్టర్ కార్యాలయంలో మంగళవారం ఎన్నికల నిర్వహణపై రాజకీయ పార్టీల నాయకులు, ఎన్నికల విభాగం సిబ్బందితో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈసందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. ఎన్నికల నియమావళిని పాటించాలన్నారు. ఎన్నికలు సజావుగా జరిగేందుకు అన్ని విధాలా సహకరించాలన్నారు. ఎన్నికల నిబంధనలకు సంబంధించి తీసుకోవాల్సిన చర్యలు, నామినేషన్ల ప్రక్రియ, స్క్రూట్ని, ఖర్చుల వివరాలు అన్ని క్లియర్‌గా ఉండాలన్నారు. ఎన్నికల కమిషన్ సూచించిన ప్రకారం నిర్వహణకు పకడ్బందీగా ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపారు. సమావేశంలో అదనపు కలెక్టర్లు లెనిన్ వత్సల్ టొప్పో, అనిల్‌కుమార్, జెడ్పీ సీఈఓ పురుషోత్తం, డీపీఓ హరిప్రసాద్, కలెక్టరేట్ ఏఓ పవన్‌కుమార్, పార్టీల నాయకులు నీరుటి సురేశ్, మార్నేని వెంకన్న, శ్యాంసుందర్, బాబు, రామారావు తదితరులు పాల్గొన్నారు.