సంపూర్ణ ఆరోగ్యం | - | Sakshi
Sakshi News home page

సంపూర్ణ ఆరోగ్యం

Sep 29 2025 8:26 AM | Updated on Sep 29 2025 8:26 AM

సంపూర

సంపూర్ణ ఆరోగ్యం

పోషకాహారం..

అంగన్‌వాడీల ఆధ్వర్యంలో పోషణ మాసం

గర్భిణులు, చిన్నారుల పౌష్టికాహారంపై

అవగాహన

గూడూరు: మాతా, శిశు మరణాలను తగ్గించడంతోపాటు ఆరోగ్య తెలంగాణ సాధనలో భాగంగా ప్రభుత్వం పోషణ మాసం కార్యక్రమాన్ని ప్రారంభించింది. తద్వారా గర్భిణులు, బాలింతలు, పిల్లలకు అంగన్‌వాడీల ద్వారా పౌష్టికాహారం అందిస్తూ.. పోషణ స్థాయిని పెంచడమే లక్ష్యంగా ఈ కార్యక్రమం కొనసాగుతోంది. ప్రతీ సంవత్సరం సెప్టెంబర్‌ 17 నుంచి అక్టోబర్‌ 16 వరకు పోషణ మాసోత్సవాలు నిర్వహిస్తుంటారు. ఇందులో గర్భి ణులు, బాలింతలతో సమావేశాలు ఏర్పాటు చేసి పౌష్టికాహారంపై అవగాహన కల్పిస్తారు. స్వయంగా అంగన్‌వాడీలు తయారు చేసిన పౌష్టికాహారాన్ని ఈ మాసంలో వారికి అందిస్తారు.

ఐసీడీఎస్‌ ప్రాజెక్టులు.. అంగన్‌వాడీలు

జిల్లాలో డోర్నకల్‌, గూడూరు, మహబూబాబాద్‌, మరిపెడ, తొర్రూరు మండల కేంద్రాల్లో ఐసీడీఎస్‌ ప్రాజెక్టులు ఉన్నాయి. అందులో మొత్తం 1,437 అంగన్‌వాడీ కేంద్రాలు, 4355 మంది గర్భిణులు, 2,895 మంది బాలింతలు, 0 నుంచి 6 ఏళ్లలోపు పిల్లలు 38,029 మంది ఉన్నారు.

పౌష్టికాహారం పంపిణీ

అంగన్‌వాడీ కేంద్రాల ద్వారా గర్భిణులు, బాలింతలతో పాటు మూడేళ్లలోపు పిల్లలకు పాలు, గుడ్లు, బాలాంమృతంతో పాటు పలు రకాల పౌష్టికాహా రాన్ని అందిస్తున్నారు. అదేవిధంగా పిల్లల ఎత్తు, బరువు తీసుకొని వారికి అవసరమైన వైద్య పరీక్షలు చేయిస్తున్నారు. అంగన్‌వాడీ కేంద్రాలకు వచ్చే ఐదేళ్లలోపు పిల్లలకు ప్రాథమిక విద్యతోపాటు గర్భిణులు, బాలింతలు, పిల్లలకు సంపూర్ణ మధ్యాహ్న భోజనం అందిస్తున్నారు. రోజు ఒక్కొక్కరికి 200 మిల్లీలీటర్ల పాలు, నెలకు 30 గుడ్లు ఇస్తూ మాతా, శిశు ఆరోగ్యాలను కాపాడుతున్నారు.

పోషణ మాసం కార్యక్రమాలు..

● స్థానిక ఉత్పత్తులు, బొమ్మలు, పౌష్టికాహారం పదార్థాల వినియోగంపై అవగాహన

● గర్భిణులు, బాలింతలు, చిన్నపిల్లల పోషణపై సలహాలు, సూచనలు ఇస్తారు. అనుంబంధ ఆహార పదార్థాల తయారీ, పోటీలు

● కిషోర బాలికల వైద్య పరీక్షలతోపాటు పిల్లల బరువు, ఎత్తు కొలతలు తీయడం, ఆహారంలో చక్కెర, నూనె వినియోగం తగ్గించడంపై అవగాహన

● చిన్నారుల తల్లిదండ్రులు, సంరక్షకులకు అనుబంధ ఆహారంపై పోటీలు, తల్లిదండ్రులతో పోషకాహారంపై ప్రతిజ్ఞ. అంగన్‌వాడీ కేంద్రాల్లో కథలు చెప్పడం, బొమ్మల ప్రదర్శన, వాటి ద్వారా ఈసీసీఈ సెషన్‌, 0–3 ఏళ్లలోపు పిల్లల ఆరంభ అభివృద్ధి, ప్రేరణ కోసం దృష్టి సారించాల్సిన కార్యక్రమాలు తల్లిదండ్రులతో చేయించడం

● పోషణ లోపం ఉన్న పిల్లలకు ఆరోగ్య పరీక్షలు, ఆకలి పరీక్షలు, గ్రోత్‌ మానిటరింగ్‌

● బిడ్డ పుట్టిన గంటలోపు ముర్రుపాలు తాపడం, పిల్లల అనుబంధ ఆహారంపై అవగాహన

● ఆరోగ్యకరమైన అహార అలవాట్లు, జీవనశైలిపై అవగాహన

● స్థానిక వంటకాలు, చిరుధాన్యాలు, కూరగాయలు, స్వదేశీ బొమ్మల తయారీ

● పోషణ మిషన్‌ వంద రోజుల ప్రచారం, గ్రామ వార్డు సభలు, పర్యావరణ పరిరక్షణపై ప్రతిజ్ఞ, గృహ సందర్శన, అంగన్‌వాడీ కేంద్రాల్లో శుభ్రత, పలు అంశాలపై అవగాహన కల్పించడం

పోషణ స్థాయిని పెంపొందిస్తాం..

అంగన్‌వాడీ కేంద్రాల ద్వారా పిల్లల పోషణ స్థాయిని పెంపొందించడమే లక్ష్యం. గర్భిణులు, బాలింతలకు పోషకాహారంపై అవగాహన కల్పిస్తాం. మాతా, శిశు మరణాల తగ్గింపునకు కృషి చేయిస్తాం. పోషక విలువలు కల్గిన అహారాన్ని తీసుకునేలా సూచిస్తాం. అంగన్‌వాడీ కేంద్రాల్లో అన్నప్రాసన, సీమంతాలు, జన్మదిన వేడుకలను కూడా నిర్వహిస్తున్నాం.

– సబిత, జిల్లా సంక్షేమ అధికారి

సంపూర్ణ ఆరోగ్యం1
1/1

సంపూర్ణ ఆరోగ్యం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement