
వైభవంగా బతుకమ్మ సంబురాలు
● జిల్లా పోలీసు కార్యాలయంలో
సందడిగా వేడుకలు
మహబూబాబాద్ రూరల్ : తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు అద్దం పట్టే బతుకమ్మ వేడుకలను మహబూబాబాద్ జిల్లా పోలీస్ కార్యాలయంలో ఆదివారం రాత్రి వైభవంగా నిర్వహించారు. జిల్లా పరిధిలో పనిచేస్తున్న పోలీసు అధికారులు, సిబ్బంది బతుకమ్మలను సర్వాంగసుందరంగా తయారుచేసి జిల్లా పోలీస్ కార్యాలయానికి తీసుకువచ్చి, బతుకమ్మ పాటలు పాడుతూ, నృత్యాలు చేస్తూ సందడిగా వేడుకలు నిర్వహించారు. జిల్లా ప్రజలందరూ సద్దుల బతుకమ్మ వేడుకలను ఆనందోత్సాహాల మధ్య జరుపుకోవాలని ఎస్పీ సుధీర్ రాంనాథ్ కేకన్ పేర్కొన్నారు. కార్యక్రమంలో ఏఆర్ డీఎస్పీ శ్రీనివాస్, మానుకోట, తొర్రూరు డీఎస్పీలు తిరుపతిరావు, కృష్ణకిశోర్, సీఐలు, ఎస్సైలు, పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.

వైభవంగా బతుకమ్మ సంబురాలు