
బాధితులకు భరోసా కల్పించాలి
వరంగల్ క్రైం: పదోన్నతులతో బాధ్యతలు కూడా పెరుగుతాయని వరంగల్ పోలీస్ కమిషనర్ సన్‌ప్రీత్ సింగ్ అన్నారు. వరంగల్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో ఎస్సైలుగా పదోన్నతి పొందిన ఎం.సాంబరెడ్డి, పి.జైపాల్, పి.లక్ష్మారెడ్డి, డి.వెంకటేశ్వర్లు, ఎం.సాంబయ్య, కె.వెంకన్న, డి.సమ్మిరెడ్డి, ఎం.లక్ష్మీనారాయణ, పి.శ్రీనివాస్ రాజు, ఎస్.సదయ్య ఆదివారం వరంగల్ పోలీస్ కమిషనర్‌ను క్యాంపు కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్ఛాలు అందజేశారు. ఈ సందర్భంగా సీపీ పదోన్నతి పొందిన అధికారుల భుజాలపై నక్షత్రాలను అలంకరించి అభినందనలు తెలిపారు. అనంతరం సీపీ సన్‌ప్రీత్ సింగ్ మాట్లాడుతూ పోలీస్ స్టేషన్‌కు వచ్చే బాధితులకు పోలీసులు భరోసా, నమ్మకాన్ని కలిగించాలని, నిరుపేద ప్రజలకు పోలీసు అధికారులు అండగా నిలవాలని పదోన్నతి పొందిన ఎస్సైలకు సూచించారు.