
పద్మశాలీలు ఉన్నత శిఖరాలకు చేరాలి
హన్మకొండ: పద్మశాలి కులస్తులు ఉన్నత శిఖరాలకు చేరాలని అఖిలభారత పద్మశాలి సంఘం జాతీయ అధ్యక్షుడు కందకట్ల స్వామి అన్నారు. పద్మశాలి అఫీషియల్స్ అండ్ ప్రొఫెషనల్స్ అసోసియేషన్ (పోపా) ఆధ్వర్యంలో హనుమకొండలోని జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో ఉమ్మడి వరంగల్ జిల్లాలో ప్రతిభ కనబరిచిన పద్మశాలి విద్యార్థులకు ఆదివారం ప్రతిభ పురస్కారాలను ప్రదానం చేశారు. కార్యక్రమంలో కందకట్ల స్వామి ము ఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడుతూ విద్యార్థులు లక్ష్యాన్ని నిర్దేశించుకుని, పట్టుదలతో ముందుకు పోతే లక్ష్యాన్ని సాధిస్తారన్నారు. గ్రూప్స్, సివిల్స్‌లో పద్మశాలీలు ఇప్పుడిప్పుడే రాణిస్తున్నారన్నా రు. రాజకీయాల్లోనూ రాణించాలని సూచించారు. పోపా రాష్ట్ర అధ్యక్షుడు, న్యాయవాది శామంతుల శ్రీనివాస్ మాట్లాడుతూ విద్యార్థులు ఇష్టంతో చదివితే సాధించలేనిదంటూ ఉండదన్నా రు. నిరుపేద విద్యార్థులకు చేయూతనివ్వాలని కోరారు. పోపా ఉమ్మడి వరంగల్ జిల్లా అధ్యక్షుడు గుండు కామేశ్వర్ మాట్లాడు తూ విద్యార్థుల్లో ప్రతిభను గుర్తించి ప్రోత్సహించడమే తమ సంఘం లక్ష్యం అన్నారు. ఈ సందర్భంగా ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు ప్రతిభ అవార్డులు అందించి సత్కరించారు. కార్యక్రమంలో డాక్టర్ కూరపాటి రమేశ్, సీనియర్ జర్నలిస్ట్ గడ్డం కేశవమూర్తి, పద్మశాలి ఉద్యోగుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు ఈగ వెంకటేశ్వర్లు పద్మశాలి సంఘం జాతీయ ఉపాధ్యక్షుడు గుండు ప్రభాకర్, పాము శ్రీనివాస్, గోషికొండ సుధాకర్, బైరి శ్యాంసుందర్, మాటేటి అశోక్, సంతోష్, ధర్మపురి రాజగోవింద్, దిడ్డి అనిల్, బత్తుల సత్యం, వంగరి వేణు, గుండేటి సతీశ్, కందకట్ల రాకేశ్, వడ్నాల సత్యనారాయణ, గుండు రవి, డాక్టర్ వన్నాల వెంకటరమణ, కుసుమ సతీశ్, వైద్యం రాజగోపాల్, డాక్టర్ కూరపాటి రాధిక, డాక్టర్ అంబటి అజయ్, మోతె రాజకుమార్, శ్రీరాముల శ్రీనివాస్, డాక్టర్ చింతకింది శ్రీనివాస్, విటోభా పాల్గొన్నారు.
అఖిల భారత పద్మశాలి సంఘం
జాతీయ అధ్యక్షుడు కందకట్ల స్వామి