
బాలికలు, మహిళలకు జిల్లా స్థాయి చెస్‌పోటీలు
విద్యారణ్యపురి : ఽదర్మసాగర్ చెస్ నెట్‌వర్క్ క్లబ్, దండేపల్లి క్లబ్, ముప్పారం క్లబ్ సంయుక్త ఆధ్వర్యంలో ఆదివారం బతుకమ్మ సంబురాల్లో భాగంగా హనుమకొండలోని టీటీడీ కల్యాణ మండపంలో బాలికలు, మహిళలకు వరంగల్ జిల్లా స్థాయి చెస్‌పోటీలు నిర్వహించారు. ఈ పోటీలను సీని యర్ కాంగ్రెస్ నాయకురాలు గుంటి స్వప్న ప్రారంభించి మాట్లాడారు. ఈ పోటీలు బా లబాలికలు, మహిళల్లోని ప్రతిభ వెలు గులోకి రావడానికి దోహదపడుతాయన్నారు. అనంతరం న్యూరోౖ సెకియాట్రిస్ట్ జగదీశ్‌బాబు మాట్లాడుతూ చదరంగం జీవన నైపుణ్యాలు నేర్పిస్తూ మానసిక శక్తిని వ్యూహాత్మక ఆలోచనలను ప్రో త్సహిస్తుందన్నారు. చీఫ్ ఆర్బటర్ రజనీకాంత్, ఆర్బిటర్ శివ , ధర్మసాగర్ చెస్‌క్లబ్ కార్యదర్శి శ్రీనివాస్ ఈపోటీలను సమన్వయం చేశారు. సెయింట్ పీటర్స్ విద్యా సంస్థల అధినేత నారాయణరెడ్డి, విశ్రాంత ఇంజనీర్ పొన్నాల రామయ్య, వరంగల్ నిట్ ఆచార్యులు ఆనంద కిశోర్, విశ్రాంత ప్రిన్సిపాల్ విజయ్‌కుమార్, విశ్రాంత ఎంపీడీఓ జైపాల్‌రెడ్డి, చెస్‌క్లబ్ ప్రధాన కార్యదర్శి శ్రీహరిరామోజీ,హెచ్‌ఎం ధర్మ పాల్గొన్నారు.