
రక్తదానం.. మరొకరికి ప్రాణదానం
తొర్రూరు: రక్తదానం మరొకరికి ప్రాణదానంగా నిలుస్తోందని డిప్యూటీ డీఎంహెచ్‌ఓ సుధీర్‌రెడ్డి అన్నారు. డివిజన్ కేంద్రంలోని ప్రభుత్వ ఆసుపత్రిలో శుక్రవారం రక్తదానం శిబిరం నిర్వహించారు. రక్తదానం చేసిన పలువురికి సర్టిఫికెట్లు ప్రదానం చేశారు. వైద్యాధికారి నందనాదేవితో కలిసి డిప్యూటీ డీఎంహెచ్‌ఓ మాట్లాడారు. రక్తాన్ని కృత్రిమంగా సృష్టించలేమని, ప్రతి ఒక్కరూ జీవితంలో ఒక్కసారైనా రక్తదానం చేయాలన్నారు. రక్తహీనతతో బాధపడే మహిళలు, చిన్నారులకు దాతలు అందించే రక్తం వారి ఆరోగ్యాన్ని కాపాడుతుందన్నారు. కార్యక్రమంలో వైద్యులు మీరాజ్, ప్రియాంక, మానస, శంకర్, కిరణ్‌కుమార్, సీహెచ్‌ఓ విద్యాసాగర్, డీపీఎంఓ వనాకర్‌రెడ్డి, ఆరోగ్య సిబ్బంది పాల్గొన్నారు.