
మహాలక్ష్మి అలంకరణలో దుర్గాదేవి
మానుకోటలో కరెన్సీ నోట్లతో అమ్మవారి అలంకరణ
మహబూబాబాద్ రూరల్/కురవి/మరిపెడ రూరల్: జిల్లా కేంద్రంలోని శ్రీవాసవి కన్యకాపరమేశ్వరి దేవాలయ కమిటీ ఆధ్వర్యంలో కొలువుదీరిన దుర్గామాతను శుక్రవారం రూ.12,121,21 కరెన్సీ నోట్లతో అలంకరించి మహాలక్ష్మి అవతారంలో పూజలు చేశారు. ప్రత్యేక ఆకర్షణగా రూ.లక్ష కాయిన్ నిలువగా అమ్మవారి సన్నిధిలో స్వదేశీ, విదేశీ నగదు ఏర్పా టు చేసి భక్తులు తమ భక్తిని చాటుకున్నారు. అలాగే మరిపెడ మండలం గుండెపూడి గ్రామంలో కొలువైన దుర్గాదేవి అమ్మవారిని రూ. 8లక్షల కరెన్సీ నోట్లతో అలంకరించి ప్రత్యేక పూజలు జరిపించారు. అదేవిధంగా కురవి మండలంలోని సూదనపల్లి గ్రామంలో మన ఊరు–మన అమ్మవారు కమిటీ ఆధ్వర్యంలో పాఠశాల వద్ద ఏర్పాటు చేసిన అమ్మవారు మహాలక్ష్మి అవతారంలో భక్తులకు దర్శనమిచ్చారు. నిర్వాహకులు రూ.50,11,16 కరెన్సీ నోట్లతో దుర్గాదేవిని, మండపాన్ని అలంకరించారు.
మరిపెడ: గుండెపూడి లక్ష్మీదేవి అలంకరణలో అమ్మవారు
కురవి: సూదనపల్లిలో కరెన్సీ నోట్లతో అమ్మవారికి అలంకరణ

మహాలక్ష్మి అలంకరణలో దుర్గాదేవి

మహాలక్ష్మి అలంకరణలో దుర్గాదేవి