
ఆత్మగౌరవ ప్రతీక చాకలి ఐలమ్మ
మహబూబాబాద్ రూరల్ : సబ్బండ వర్గాల ఆత్మగౌరవానికి ప్రతీక చాకలి ఐలమ్మ అని ఎస్పీ సుధీర్ రాంనాథ్ కేకన్ అన్నారు. శుక్రవారం చాకలి ఐలమ్మ జయంతి సందర్భంగా మహబూబాబాద్ జిల్లా పోలీస్ కార్యాలయ ఆవరణలో ఏర్పాటు చేసిన చాకలి ఐలమ్మ చిత్రపటానికి ఎస్పీ పూలమాలవేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తెలంగాణ సాయుధ పోరాట యోధురాలు చాకలి ఐలమ్మ అని కొనియాడారు. కార్యక్రమంలో ఏఆర్ డీఎస్పీ విజయప్రతాప్, ఎస్బీ, డీసీఆర్బీ సీఐ సత్యనారాయణ, ఎస్సైలు వెంకన్న, జితేందర్, ఆర్‌ఎస్సై శేఖర్, డీపీఓ కార్యాలయ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.
కలెక్టరేట్‌లో చాకలి ఐలమ్మ జయంతి
మహబూబాబాద్: కలెక్టర్ కార్యాలయంలోని ప్రధాన సమావేశ మందిరంలో శుక్రవారం వెనుకబడిన తరగతుల సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో వీరనారి చాకలి ఐలమ్మ జయంతి వేడుకలు నిర్వహించారు. చాకలి ఐలమ్మ చిత్రపటానికి కలెక్టర్ అద్వైత్‌కుమార్ సింగ్ పూల మాలలు వేసి నివాళులర్పించారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్ లెనిన్ వత్సల్ టొప్పో, వెనుకబడిన తరగతుల సంక్షేమశాఖ జిల్లా అధికారి శ్రీనివాసరావు, డీఆర్‌డీఓ మధుసూదన్‌రాజు, డీఏఓ విజయనిర్మల, హార్టికల్చర్ జిల్లా అధికారి మరియన్న, జిల్లా అధికారులు పాల్గొన్నారు.

ఆత్మగౌరవ ప్రతీక చాకలి ఐలమ్మ