
వ్యాపారులు సహకరించాలి
మహబూబాబాద్: వ్యాపారులు అన్ని విధాలా సహకరించాలని, వ్యాపారుల కోసమే మోడల్ కూరగాయల మార్కెట్ అని మానుకోట మున్సిపల్ కమిషనర్ రాజేశ్వర్ అన్నారు. స్థానిక మున్సిపాలిటీ కార్యాలయంలో శుక్రవారం గాంధీ పార్క్‌లో కూరగాయలు విక్రయిస్తున్న 64మందికి గానూ 60 మందికి డ్రాపద్ధతిలో మోడల్ మార్కెట్‌లో షాపులు కేటాయించారు. ఈసందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ.. మోడల్ మార్కెట్‌లో అన్ని వసతులు ఉన్నాయని దానిని శుభ్రంగా ఉంచుకోవాలన్నారు. కూరగాయలు విక్రయించే వారికి ఎలాంటి సమస్య ఉండదన్నారు. వ్యాపారులు అందరూ సమన్వయంతో కలిసి వ్యాపారం చేసుకోవాలన్నారు. వ్యాపారులకు మున్సిపాలిటీ పరంగా సహకారం ఉంటుందన్నారు. నలుగురు కోడిగుడ్లు విక్రయించే వ్యాపారులకు నాన్ వెజ్ మార్కెట్‌లో అవకాశం కల్పిస్తామన్నారు. వెజ్, నాన్ వెజ్ విక్రయించే వారంతా ఆ మోడల్ మార్కెట్‌లో ఉండడం వల్ల ప్రజలకు కూడా అనుకూలంగా ఉంటుందన్నారు. రోడ్లపై ట్రాఫిక్ సమస్య కూడా చాలా వరకు తగ్గుతుందన్నారు. అడ్డగోలుగా గుమ్చీలను ఏర్పాటు చేసుకోవద్దన్నారు. కార్యక్రమంలో డీఈ సీహెచ్. ఉపేందర్, ఏఈ కుమార్,టీపీఓ సాయిరాం, టీపీఎస్ ప్రవీణ్, మేనేజర్ శ్రీధర్, సిబ్బంది రాజేష్, అమర్, మామ్ముటి, శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు.