
గోదావరి పరవళ్లు
● మేడిగడ్డ బ్యారేజీకి 8.35లక్షల క్యూసెక్కుల ఇన్‌ఫ్లో
కాళేశ్వరం: ఎగువన కురుస్తున్న వర్షాల కారణంగా కాళేశ్వరం వద్ద గోదావరి పరవళ్లు తొక్కుతుంది. జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహదేవపూర్ మండలం కాళేశ్వరం త్రివేణి సంగమం వద్ద 11.410 మీటర్ల ఎత్తులో నీటిమట్టం పుష్కర ఘాట్‌ను తాకుతూ ప్రవహిస్తోంది. దీంతో కాళేశ్వరం ప్రాజెక్టులోని మేడిగడ్డ బ్యారేజీకి 8.35లక్షల క్యూసెక్కుల ఇన్‌ఫ్లో చేరుతుంది. బ్యారేజీలోని మొత్తం 85 గేట్లు ఎత్తి నీటిని దిగువకు అదేస్థాయిలో ఇంజనీర్లు తరలిస్తున్నారు. కాగా, రాత్రి వరకు తగ్గుముఖంపట్టే అవకాశం ఉందని అధికారులు తెలిపారు.