మడికొండ: హనుమకొండ జిల్లా మడికొండకు చెందిన బాలుడు డెంగీ వ్యాధితో శుక్రవారం మృతి చెందాడు. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. కాజీపేట మండలం మడికొండకు చెందిన పెనుకుల రాధిక– కుమార్ దంపతులు గత కొద్ది సంవత్సరాలుగా హైదరాబాద్‌లో కూలిపని చేసుకుంటూ జీవనం కొనసాగిస్తున్నారు. వారికి ముగ్గురు కుమార్తెలు, కుమారుడు పెనుకుల మనీష్ (14) సంతా నం కలిగారు. ఈక్రమంలో మనీష్ నాలుగు రోజులుగా జ్వరంతో బాధపడుతున్నాడు. దీంతో ప్రైవేట్ ఆస్పత్రికి తీసుకెళ్లగా చికిత్స పొందుతూ గురువారం రాత్రి మృతి చెందాడు. శుక్రవారం మడికొండలో అంత్యక్రియలు నిర్వహించారు.