
మెరుగైన వైద్య సేవలందించాలి
● కలెక్టర్ అద్వైత్ కుమార్ సింగ్
● ప్రభుత్వ ఆస్పత్రి తనిఖీ
నెహ్రూసెంటర్: ప్రభుత్వ ఆస్పత్రికి వచ్చే సామాన్య ప్రజలకు మెరుగైన వైద్య సేవలందించాలని, ఆస్పత్రి పరిసరాలను శుభ్రంగా ఉంచాలని కలెక్టర్ అద్వైత్ కుమార్ సింగ్, ఎస్పీ సుధీర్ రాంనాఽథ్ కేకన్ సూచించారు. జిల్లా ప్రభుత్వ ఆస్పత్రిని గురువారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా వారు ఆస్పత్రిలోని అన్ని వార్డులను తిరుగుతూ ప్రజలకు అందుతున్న వైద్య సేవల గురించి అడిగి తెలుసుకున్నారు. సిబ్బంది హాజరు రిజిస్టర్, పేషెంట్ల రిజిస్టర్లను పరిశీలించారు. ఆస్పత్రికి వచ్చే రోగులకు వెంట వెంటనే పరీక్షలు నిర్వహించి వైద్య సేవలందించాలని సూచించారు. ప్రతీ వార్డులో సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని, ఆస్పత్రి వద్ద అవుట్‌పోస్టు సిబ్బంది ఉండాలని, తదితర భద్రతా చర్యలపై సీఐ మహేందర్‌రెడ్డికి ఎస్పీ పలు సూచనలు చేశారు. తనిఖీల్లో ఇన్‌చార్జ్ సూపరిండెంటెంట్ జగదీశ్వర్, వైద్యులు, సిబ్బంది పాల్గొన్నారు.