
ఐటీడీఏ ట్రైబల్ వెల్ఫేర్ డీడీ బాధ్యతల స్వీకరణ
ఏటూరునాగారం: ఏటూరునాగారం ఐటీడీఏ ట్రైబల్ వెల్ఫేర్ డిప్యూటీ డైరెక్టర్‌గా దబ్బకట్ల జనార్దన్ గురువారం బాధ్యతలు స్వీకరించారు. ఇంతకుముందు డీడీగా పనిచేసిన పోచం కమిషనరేట్‌లో జాయింట్ డైరెక్టర్‌గా పదోన్నతిపై బదిలీ అయ్యారు. మంచిర్యాలలో డీటీడీఓగా పనిచేసిన జనార్దన్ పదోన్నతిపై ఏటూరునాగారం బదిలీ కావడంతో విధుల్లో చేరారు. అనంతరం పీఓను మర్యాదపూర్వకంగా కలిశారు. కార్యక్రమంలో జీసీడీఓ పెనక సుగుణ, పీసా కోఆర్డినేటర్ ప్రభాకర్, కాక భాస్కర్, మైనర్‌బాబు, శ్రీకాంత్, లక్ష్మీనారాయణ, ఉద్యోగులు తదితరులు పాల్గొన్నారు.