
మెరుగైన విద్యుత్ సరఫరా చేయాలి
నెహ్రూసెంటర్: విద్యుత్ వినియోగదారులకు మెరుగైన విద్యుత్ సరఫరా చేయాలని, అందుకు తగిన చర్యలు తీసుకోవాలని విద్యుత్‌శాఖ డైరెక్టర్ టి.మధుసూదన్, చీఫ్ ఇంజనీర్ కె.రాజుచౌహాన్ సూచించారు. సంస్థ కార్యాలంలో గురువారం విద్యుత్‌శాఖ జిల్లా అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. విద్యుత్ అంతరాయం కలగకుండా చర్యలు తీసుకుంటూ సమస్య తలెత్తిన వెంటనే సిబ్బంది అక్కడకు చేరుకుని పరిష్కరించాలన్నారు. వినియోగదారులకు అసౌకర్యం కలిగించకుండా, సరఫరాలో మెళకువలు పాటించాలన్నారు. ఓవర్‌లోడ్ సమస్యలను ఎప్పటికప్పుడు సరి చేసుకోవాలన్నారు. వినియోగదారులకు మెరుగైన విద్యుత్ సరఫరా చేసేలా అధికారులు, సిబ్బంది కృషి చేయాలన్నారు. విద్యుత్ ప్రమాదాలను నివారిస్తూ ప్రమాద రహిత జిల్లాగా మార్చేందుకు సిబ్బంది, అధికారులు అప్రమత్తంగా విధులు నిర్వహించాలన్నారు. ప్రజలు, రైతులకు విద్యుత్ వినియోగం, ప్రమాదాలు, భద్రతా అంశాలపై అవగాహన కల్పించాలని సూచించారు. సాంకేతిక అంశాలను జోడిస్తూ విద్యుత్ అంతరాయాలను తగ్గిస్తూ లో ఓల్టేజీ సమస్యలను అధిగమించాలన్నారు. కార్యక్రమంలో ఇంజనీరింగ్ సూపరింటెండెంట్ పి.విజయేందర్‌రెడ్డి, డీఈలు విజయ్, సునీతాదేవి, హీరాలాల్, ఏడీలు, ఏఈలు, సిబ్బంది పాల్గొన్నారు.