
బొగ్గు ఉత్పత్తికి అంతరాయం
భూపాలపల్లి అర్బన్: ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షం కారణంగా గురువారం భూపాలపల్లి ఏరియాలోని ఓపెన్ కాస్టు గనుల్లో బొగ్గు ఉత్పత్తికి అంతరాయం ఏర్పడింది. ఏరియాలోని కేటీకే ఓపెన్ కాస్టు –2,3 ప్రాజెక్టుల్లో మూడు షిప్టుల్లో బొగ్గు ఉత్పత్తి నిలిచిపోయింది. ఓపెన్‌కాస్టు ప్రాజెక్టుల్లోని పని స్థలాల్లో వర్షపు నీరు వచ్చి చేరింది. గని ఆవరణలో రోడ్లు బురదగా మారాయి. దీంతో సుమారు 8 వేల టన్నుల బొగ్గు ఉత్పత్తికి అంతరాయం ఏర్పడింది. ఓపెన్‌కాస్టులో చేరిన వర్షపు నీటిని భారీ మోటార్లు ఏర్పాటు చేసి బయటకు ఎత్తిపోస్తున్నారు.
కరాటేతోనే హీరో అయ్యాను..
● ప్రముఖ సినీ నటుడు సుమన్
పాలకుర్తి టౌన్: కరాటే, మార్షల్ ఆర్ట్స్ ఆత్మస్థైర్యం, వ్యక్తిత్వం, గుణాన్ని మెరుగుపరుస్తాయని ప్రముఖ సినీనటుడు సుమన్ అన్నారు. మండల కేంద్రంలోని బషారత్ గార్డెన్‌లో కరాటే శిక్షణ శిబిరం గురువారం ముగిసింది. ముఖ్య అతిథిగా ఆయన హాజరై కరాటేలో ప్రతిభ కనబరిచిన వారికి సర్టిఫికెట్లను అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కరాటేతో తాను హీరో అయ్యానని, సినీ ఇండస్ట్రీలో అడుగుపెట్టి 48 ఏళ్లు అవుతోందని తెలిపారు. ఇప్పటి వరకు వివిధ భాషల్లో 800 చిత్రాల్లో నటించానని, తెలుగులో 100 సినిమాల్లో హీరో రోల్ చేశానని వివరించారు. తల్లిదండ్రులు తమ పిల్లలకు కరాటేలో శిక్షణ ఇప్పించాలని సూచించారు. వరంగల్‌కు చెందిన కరాటే మాస్టర్ యాకూబ్ మృతి చెందడం బాధాకరం అన్నారు. డబ్ల్యూఎఫ్ చీఫ్ హసన్ మాట్లాడుతూ సుమన్ లాంటి గొప్ప నటుడు ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిఽథిగా రావడం సంతోషంగా ఉందన్నారు. కరాటే ముఖ్యంగా బాలికలకు అత్యవసరమన్నారు. తెలంగాణ అధ్యక్షుడు చంద్రశేఖర్, మాస్టర్లు అన్వర్, షీటీం లక్ష్మి తదితరులు పాల్గొన్నారు.
విద్యుదాఘాతంతో
రైతు మృతి
తొర్రూరు రూరల్: ప్రమాదవశాత్తు విద్యుదాఘాతంతో ఓ రైతు మృతి చెందిన సంఘటన మండలంలోని అరిపిరాల గ్రామంలో గురువారం చోటు చేసుకుంది. స్థానికుల కథనం ప్రకారం.. గ్రామానికి చెందిన తలారి వీరయ్య(56) పశుగ్రాసం కోసం వ్యవసాయ బావి వద్దకు వెళ్లాడు. పచ్చిగడ్డి కోస్తుండగా ప్రమాదవశాత్తు సర్వీస్ వైరుకు కొడవలి తాకడంతో విద్యుదాఘాతానికి గురై అక్కడికక్కడే మృతి చెందాడు. మృతుడికి భార్య లక్ష్మితోపాటు ఇద్దరు కుమారులు, ఇద్దరు కుమారైలు ఉన్నారు. ప్రభుత్వం వీరయ్య కుటుంబాన్ని ఆదుకోవాలని స్థానికులు కోరారు.

బొగ్గు ఉత్పత్తికి అంతరాయం

బొగ్గు ఉత్పత్తికి అంతరాయం

బొగ్గు ఉత్పత్తికి అంతరాయం