
బతుకమ్మ సంబురాలు విజయవంతం చేయాలి
అదనపు కలెక్టర్ లెనిన్ వత్సల్ టొప్పో
మహబూబాబాద్: జిల్లాలోని అన్ని గ్రామపంచాయతీలు, మున్సిపల్‌వార్డులు, జిల్లాని ఆస్ప త్రులు, అంగన్‌వాడీ కేంద్రాలు, మున్సిపల్ కార్యాలయాల్లో ఈనెల 25నుంచి బతుకమ్మ సంబురాలు నిర్వహించాలని అదనపు కలెక్టర్ లెనిన్ వత్సల్ టొప్పో బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈనెల 27న కలెక్టర్ కార్యాలయాన్ని పూలతో అలంకరించాలన్నారు. రోజు సాయంత్రం 4గంటలకు కలెక్టర్ ప్రాంగణంలో అన్ని విభాగాల మహిళా సిబ్బందితో బతుకమ్మ సంబురాలు నిర్వహించాలన్నారు. ఈ నెల 27న సాయంత్రం బతుకమ్మలకు బహుమతులు ప్రదానం చేస్తారని పేర్కొన్నారు. జిల్లాలోని అన్ని శాఖల అధికారులు ప్రభుత్వం సూచించిన విధంగా తమ సిబ్బందికి ప్రొటోకాల్ ప్రకారం తగు సూచనలు చేసి, పండుగ వాతావరణం ఉట్టిపడేలా కార్యాలయాలను పూలతో అలంకరించుకొని బతుకమ్మ సంబురాలను విజయవంతం చేయాలన్నారు.
ఆదివాసీల అభివృద్ధికి ‘ఆదివాసీ కర్మయోగి’
మహబూబాబాద్ అర్బన్: కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన ఆదివాసీ కర్మయోగి పథకం ఆదివాసీలు, గిరిజనుల అభివృద్ధికి ఎంతో దోహదపడుతుందని ఆర్డీఓ కృష్ణవేణి అన్నారు. జిల్లా కేంద్రంలోని ఎంపీడీఓ కార్యాలయంలో గిరిజనశాఖ ఆధ్వర్యంలో బుధవారం మండలస్థాయి ఆదివాసీ కర్మయోగి శిక్షణ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆర్డీఓ మాట్లాడుతూ.. తండాలు, గూడేల్లో ప్రజల స్థితి గతులు పరిశీలించి, వారి సమస్యలను వారే పరిష్కరించుకొనే దిశగా సూచనలు చేయాలన్నారు. వివిధ శాఖల అధికారులు సమన్వయంతో ఆదివాసీ గూడేలు, గిరిజన తండాల్లో పథకంపై అవగాహన కల్పించాలన్నారు. కార్యక్రమంలో ఏపీఎం శంకర్, డాక్టర్ మౌనిక, ట్రైబల్ హెచ్‌డబ్ల్యూఓ అనిత, ఐసీడీఎస్ సూపర్‌వైజర్ పద్మావతి, మిషన్ భగీరథ ఏఈ శ్రీకాంత్, ఎఫ్‌ఆర్‌ఓ జ్యోత్స్నాదేవి తదితరులు పాల్గొన్నారు.
షెడ్యూల్డ్ కులాల అభివృద్ధిశాఖ అధికారిగా శ్రీనివాసరావు
మహబూబాబాద్ అర్బన్: జిల్లా షెడ్యూల్డ్ కులాల అభివృద్ధిశాఖ అధికారిగా శ్రీనివాసరా వు బుధవారం బాధ్యతలు స్వీకరించారు. గతంలో ఇక్కడ విధులు నిర్వర్తించిన అధికారి ఎం.నరసింహస్వామి హనుమకొండ జిల్లాకు బదిలీ అయ్యారు. కాగా, కార్యాలయ అధికారులు, సిబ్బంది జిల్లా అధికారి శ్రీనివాసరావును మ ర్యాదపూర్వకంగా కలిసి బొకే అందజేశారు.
అదనపు బాధ్యతలు
మహబూబాబాద్ అర్బన్: జిల్లా వెనకబడిన తరగతుల అభివృద్ధి సంక్షేమశాఖ అధికారిగా బి.శ్రీనివాస్ బుధవారం అదనపు బాధ్యతలు స్వీకరించారు. గతంలో పని చేసిన జిల్లా అధికారి ఎం.నర్సింహస్వామి హనుమకొండ జిల్లాకు బదిలీ అయ్యారు. కాగా జిల్లా మైనార్టీ శాఖ అధికారి శ్రీనివాస్‌కు అదనపు బాధ్యతలు అప్పగించారు. బీసీ సంక్షేమశాఖ అధికారులు, సిబ్బంది ఆయనను మర్యాదపూర్వకంగా కలిసి బొకే అందజేశారు.
రైతులు జాగ్రత్తలు
పాటించాలి
మహబూబాబాద్ రూరల్ : రైతులు మిరప నారు కొనుగోలులో తగిన జాగ్రత్తలు పాటించాలని జిల్లా ఉద్యాన, పట్టు పరిశ్రమ అధికారి మరియన్న, జిల్లా వ్యవసాయ అధికారి విజయనిర్మల మంగళవారం తెలిపారు. జిల్లా అధికారులు ధ్రువీకరించిన నర్సరీల నుంచి మాత్రమే మిరప నారు కొనుగోలు చేయాలని సూచించారు. ఇతర ప్రాంతాల నుంచి వచ్చే మిరప నారును ఎలాంటి ధ్రువీకరణ బిల్లులు లేకుండా రైతులు కొనుగోలు చేయవద్దని తెలిపారు. పేరొందిన కంపెనీల నారు మొక్కలను కొనుగోలు చేయాలన్నారు. గుర్తు తెలియని, అడ్రస్ లేని వారి నుంచి మిరప నారు కొనుగోలు చేసి రైతులు ఇబ్బందులు పడొద్దని సూచించారు. రైతులకు ఎలాంటి సందేహాలు ఉన్నా సంబంధిత ఉద్యాన, వ్యవసాయ అధికారులను సంప్రదించాలని వారు పేర్కొన్నారు.

బతుకమ్మ సంబురాలు విజయవంతం చేయాలి