
డీజేను నిషేధిద్దాం!
డీజేతో అనర్థాలెన్నో..
ఖిలా వరంగల్: ప్రస్తుతకాలంలో ఊరేగింపులు.. పెళ్లిళ్లు.. జన్మదినాలు.. చావులు.. రాజకీయ పార్టీల సభలు.. ర్యాలీలు.. ఇలా వేడుక ఏదైనా డీజేను విరివిగా వినియోగిస్తున్నారు. ఆయా సందర్భాల్లో కచ్చితంగా డీజే శబ్దాల మోత మార్మోగుతోంది. నిన్న, మొన్నటి వరకు ఎక్కడో హైదరాబాద్ లాంటి మహానగరాలు, పబ్‌లకు పరిమితమైన ఆ సంస్కృతి నేడు నగర, పట్టణాలు, పల్లెలకు చేరింది. ఫలితంగా ఇప్పటికే వాయు కాలుష్యంతో అల్లాడితున్న జనం.. ప్రస్తుతం ఈ డీజే శబ్ద కాలుష్యం బారిన పడి ఆరోగ్య సమస్యలు కొని తెచ్చుకుంటున్నారు. కాగా, సుప్రీం కోర్టు మార్గదర్శకాల్ని ఉల్లంఘించేలా డీజే శబ్దాలు ఉంటున్నా నియంత్రణకు చర్యలు కనిపించడం లేదనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఈవిషయంలో ప్రభుత్వ శాఖల మధ్య సమన్వయ లోపం స్పష్టంగా కనిపిస్తోందని పలువురు పేర్కొంటున్నారు.
నిబంధనలు బేఖాతర్..
శబ్ద కాలుష్యాన్ని నియంత్రించేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రివెన్షన్ ఆఫ్ ఎన్విరాన్‌మెంట్ అండ్ సౌండ్ పొల్యూషన్ చట్టాన్ని అమలు చేస్తున్నాయి. ఇందులో భాగంగా రాత్రి 10 నుంచి మరుసటి రోజు ఉదయం 6 గంటల వరకు అధిక శబ్దం చేసే డీజేలు, బాణాసంచా పేల్చడం లాంటి చర్యలపై నిషేధం ఉంది. అయితే ఈ నిబంధన ఎక్కడా అమలుకు నోచుకోవడం లేదు. రాత్రి 10 తర్వాతే పెళ్లిళ్లు, జన్మదిన వేడుకలు, రాజకీయ పార్టీల ఊరేగింపుల్లో శబ్దాల మోత దద్దరిల్లుతోంది. ఆ మోతలు చెవులకు చిల్లులు పడుతున్నాయి.
ముప్పు గుర్తిద్దాం..
సాధారణంగా మానవుడి చెవులు 120 నుంచి 130 డెసిబుల్స్ వరకు శబ్దాన్ని భరిస్తాయి. 150 డెసిబుల్స్ వరకు వెళ్తే వినికిడి సమస్యలు వస్తాయి. కర్ణబేరి దెబ్బతినే అవకాశం ఉంది. రక్తపోటు పెరుగుతోంది. డీజే నుంచి వెలువడే వైబ్రేషన్స్‌తో శరీరంలో నాడి వ్యవస్థ దెబ్బతిని మొదడుకు రక్తం సరఫరా తగ్గుతుంది. గుండెకు రక్తం అందించే నాళాలు మూసుకుపోతాయి. ఫలితంగా గుండెకు రక్తం సరఫరా తగ్గి గుండెపోటు వచ్చే అవకాశం ఉందని వైద్యులు పదేపదే చెబుతున్నారు. గర్భిణులు డీజే శబ్దం వింటే గర్భస్థ శిశువు నిద్రకు విఘాతం కలుగుతుంది. తద్వారా పిండం పెరుగుదల, శిశువు ఆరోగ్యంపై ప్రభావం పడుతుంది. బాలింత, నవజాత శిశువు చెవులకు అధిక శబ్ధం చేరితే వినికిడి సమస్యలతో పాటు శరీరంలోని అవయవాల పనితీరుపై ప్రభావం చూపుతుంది. ఎందుకంటే ప్రసవం తర్వాత తల్లి, బిడ్డలో వ్యాధి నిరోధక శక్తి తక్కువ ఉంటుంది.
పలు ఆరోగ్య సమస్యలు ఉత్పన్నం
నిబంధనలు పట్టించుకోని
నిర్వాహకులు
కనిపించని డీజే నియంత్రణ చర్యలు
ప్రమాదంలో ప్రజారోగ్యం
డీజే శబ్దంతో అనేక ఆరోగ్య సమస్యలు ఉత్పన్నమవుతాయని ఈఎన్‌టీ వైద్యులు చెబుతున్నారు. 85 డెసిబుల్స్ శబ్దం దాటితే వినికిడి, గుండె సంబంధిత సమస్యలు ఏర్పడతాయి. రక్తపోటు(బీపీ) పెరుగుతుంది. నిద్రలేమితోపాటు ఒత్తిడి పెరిగి మైగ్రేన్ సమస్యలు వస్తాయి. అలర్జీతోపాటు శ్వాస కోశ సంబంధిత సమస్యలు ఉత్పన్నమవుతాయి. తలనొప్పి చికాకుతోపాటు నిద్రలేమి, అలసట ఏర్పడుతుంది. ఎక్కువ కాలం అధిక శబ్దం వినడంతో గుండె జబ్బులు, చెవుడు రావొచ్చు. మానసిక, శారీర కుంగుబాటుకు గురయ్యే ప్రమాదం ఉంటుంది.
ఆ శబ్దంతో పెరుగుతున్న గుండె జబ్బులు..
శబ్ద కాలుష్యానికి దూరంగా ఉండాలి
డీజే శబ్ద కాలుష్యంతో ఆరోగ్య సమస్యలు ఉత్పన్నమవుతాయి. గుండె జబ్బులు, నిద్రలేమి, రక్తపోటు(బీపీ)వినికిడి సమస్యలు అధికంగా వస్తాయి. దీనిని దృష్టిలో ఉంచుకుని ప్రజలు శబ్ద కాలుష్యానికి దూరంగా ఉండాలి.
డాక్టర్ ఎండీ సలీం జనరల్ ఫిజీషియన్, వరంగల్

డీజేను నిషేధిద్దాం!

డీజేను నిషేధిద్దాం!