
అద్దె బస్సులకు పార్కింగ్ స్థలం కేటాయించాలి
హన్మకొండ : ఆర్టీసీ అద్దె బస్సులకు పార్కింగ్ స్థలం కేటాయించాలని ఆర్టీసీ ఆద్దె బస్సుల యజమానుల సంక్షేమ సంఘం రాష్ట్ర గౌరవాధ్యక్షుడు లక్కం ప్రభాకర్, వరంగల్ రీజి యన్ అధ్యక్షుడు మారిపల్లి రాంరెడ్డి కోరారు. హనుమకొండ ‘కుడా’ కార్యాలయంలో చైర్మన్ ఇనుగాల వెంకట్రాంరెడ్డిని అద్దె బస్సుల య జమానుల సంక్షేమ సంఘం నాయకులు బుధవారం కలిశారు. హనుమకొండ జిల్లా బస్‌స్టేషన్ కూడలి, సర్క్యూట్ హౌజ్ రోడ్, కాకాజీ కాలనీ ప్రాంతంలో రోడ్డుకిరువైపులా బస్సులను నిలపడం ద్వారా సమస్యలు తలెత్తుతున్నాయని, బాలసముద్రంలోని ‘కుడా’ స్థలా న్ని కేటాయించాలని చైర్మన్‌ను కోరారు. స్పందించిన చైర్మన్.. వైస్ చైర్మన్, వరంగల్ ము న్సిపల్ కమిషనర్‌తో చర్చించి నిర్ణయం తీసుకుంటామని చెప్పారని యజ మానుల సంఘం నాయకులు తెలిపారు. ‘కుడా’ చైర్మన్‌ను కలిసిన వారిలో వెంకటేశ్వర్లు, ఫర్వేజ్, రాజ లింగారెడ్డి, సదానందం ఉన్నారు.