
డోర్నకల్ వాసికి అరుదైన గౌరవం
డోర్నకల్ : డోర్నకల్‌కు చెందిన ఉప్పరి పృథ్వీకి అరుదైన గౌరవం దక్కింది. జాతీయ ఉత్తమ స్టంట్ కొరియోగ్రాఫర్‌గా ఎంపికై రాష్ట్రపతి ద్రౌపతి ముర్ము చేతుల మీదుగా పురస్కారం అందుకున్నారు. 2023వ జాతీయ చలనచిత్ర అవార్డుల్లో భాగంగా తెలుగు సినిమా ‘హనుమాన్’కు సంబంధించి బెస్ట్ స్టంట్ కొరియోగ్రాఫర్‌గా ఎంపికై ఢిల్లీలోని విజ్ఞాన్ భవన్‌లో మంగళవారం రాత్రి జరిగిన కార్యక్రమంలో రాష్ట్రపతి ద్రౌపతి ముర్ము చేతుల మీదుగా అవార్డు అందుకున్నారు. స్థానిక అంబేడ్కర్‌నగర్‌కు చెందిన ఉప్పరి శేఖర్, రూపావతి దంపతుల కుమారుడు పృథ్వీ సినీరంగంలోకి ప్రవేశించి సుమారు 50 సినిమాలకు స్టంట్ కొరియోగ్రాఫర్‌గా పని చేశారు. ‘క్లూ’ అనే తెలుగు సినిమాలో హీరోగా నటించాడు. పృథ్వీ తండ్రి శేఖర్ కూడా పలు సినిమాల్లో నటించడంతో పాటు స్టంట్ కొరియోగ్రాఫర్‌గా పని చేసి పలు అవార్డులు అందుకున్నారు. చాలా కాలంగా శేఖర్, పృథ్వీ కుటుంబం హైదరాబాద్‌లో నివాసం ఉంటుండగా వీరి కుటుంబ సభ్యులు డోర్నకల్‌లో ఉంటున్నారు.
రాష్ట్రపతి చేతుల మీదుగా పురస్కారం అందుకున్న పృథ్వీ