కోటీశ్వరులను చేస్తామని కొల్లగొట్టారు.. | - | Sakshi
Sakshi News home page

కోటీశ్వరులను చేస్తామని కొల్లగొట్టారు..

Sep 25 2025 12:23 PM | Updated on Sep 25 2025 12:23 PM

కోటీశ

కోటీశ్వరులను చేస్తామని కొల్లగొట్టారు..

గతంలోనూ పాలకుర్తి కేంద్రంగా దందా..

పోలీసుల చర్యలు శూన్యం

పాలకుర్తి టౌన్‌: పాలకుర్తిలో మల్టీలెవల్‌ మార్కెటింగ్‌ మోసం వెలుగుచూసింది. నిర్వాహకులను టాస్క్‌ఫోర్స్‌ పోలీసులు అదుపులోకి తీసుకోవడంతో బాధితులు లబోదిబోమంటున్నారు. వివరాలిలా ఉన్నాయి. సూర్యాపేట జిల్లాకు చెందిన తెప్పలి సైదులు రెండు సంవత్సరాల క్రితం జనగామ జిల్లా పాలకుర్తి మండల కేంద్రంలోని గుడివాడ చౌరస్తాలో ఓ భవనాన్ని అద్దెకు తీసుకున్నాడు. మొదట రియాల్టీ బిజినెస్‌ ఫెయిర్‌ హెల్ప్‌ సిస్టం (ఆర్‌బీఎఫ్‌) సంస్థను స్థాపించాడు. నెల రోజుల క్రితం హెప్సిబా మార్కెటింగ్‌ సంస్థ ఏర్పాటు చేశాడు. కోటీశ్వరులను చేస్తామని ప్రజలను నమ్మించి వారి నుంచి పెద్ద మొత్తంలో పెట్టుబడి పెట్టించాడు. వీటిలో సభ్యుడిగా చేరే వ్యక్తి మొదట రూ.6 వేలు చెల్లించగానే రూ.2వేల విలువైన నిత్యావసర సరుకుల కిట్‌ అందించాడు. రెండో నెలలో రూ.వెయ్యి చొప్పున 20 నెలలు ఇస్తామని ప్రజలను నమ్మబలికాడు. దీంతో 10 నెలల కాలంలో ఆ సంస్థల్లో నాలుగు వేల మందిని చేర్పించి రూ.100 కోట్ల పెట్టుబడులు పెట్టించాడు. పెట్డుబడి పెట్టిన వారికి ప్రతినెల అకౌంట్లలో డబ్బులు జమయ్యాయి. అఽత్యాశతో పేద ప్రజలు అప్పు చేసి ఈ సంస్థల్లో పెట్టుబడి పెట్టారు. ఆర్బీఎఫ్‌లో పెట్టుబడుల కోసం రాష్ట్రంలోనే రికార్డు స్థాయిలో బాధితులు బంగారం తాకట్టు పెట్టారు. బంగారం తాకట్టులో రాష్ట్రంలోనే పాలకుర్తిలోని ఓ ప్రైవేట్‌ సంస్థ ప్రథమ స్థానం సాధించింది. దినసరి కూలీల నుంచి మధ్యతరగతి కుటుంబాలు, ప్రభుత్వ ఉద్యోగుల వరకు భారీగా బంగారం తాకట్టు పెట్టినట్లు విశ్వసనీయ సమాచారం. ప్రజలను నమ్మించేందుకు పాలకుర్తి ఆర్టీసీ బస్టాండ్‌ పక్కన రూ.కోటితో స్థలం కొనుగోలు చేసి రూ.2 కోట్లతో భవన నిర్మాణ పనులు ప్రారంభించాడు. అనధికారికంగా ఈ సంస్థను నిర్వహించడంతోపాటు మనీలాండరింగ్‌కు పాల్పడినందుకు సైదులుతోపాటు మరో ముగ్గురిని వరంగల్‌ టాస్క్‌ఫోర్స్‌ పోలీసులు సోమవారం రాత్రి అదుపులోకి తీసుకున్నారు. పెట్టుబడి పెట్టినవారు తమ డబ్బులు వసాయోరావోనని ఇప్పుడు ఆందోళన చెందుతున్నారు.

పాలకుర్తిలో హెప్సిబా, ఆర్‌జీఎఫ్‌ కార్యాలయం

మల్టీలెవల్‌ మార్కెటింగ్‌ వ్యాపారాలపై గ్రామాల్లో ప్రజలకు అవగాహన లేకపోవడంతోనే తరచూ ఇలాంటి సంఘటనలు చోటు చేసుకుంటున్నాయి. గతంలో పాలకుర్తి కేంద్రంగా మల్టీలెవల్‌ మార్కెటింగ్‌ దందా పేరుతో ప్రజలను మోసం చేసిన సంస్థలు అనేకం ఉన్నాయి. విశ్వజ్యోతి, గురుదేవ, లక్ష్య లాంటి మల్టీలెవల్‌ మార్కెటింగ్‌ సంస్థల్లో పెట్టుబడులు పెట్టి కోట్లాది రూపాయలు పోగొట్టుకున్నారు. అధిక శాతం వడ్డీ ఇస్తామని నమ్మబలికి కొన్ని నెలలపాటు సక్రమంగా చెల్లింపులు చేయడంతో వారిని జనాలు గుడ్డిగా నమ్మారు. ఒకరిని చూసి ఒకరు ఇలా సామాన్య, మధ్య తరగతి ప్రజలు ఈ మల్టీలెవల్‌ మార్కెటింగ్‌ మాయగాళ్ల వలలో పడి మోసపోతున్నారు. ఉన్నదంతా ఊడ్చుకొచ్చి సదరు సంస్థల్లో పెట్టుబడులు పెడుతున్నారు. ఆరు నెలలు తిరిగేలోపే ఆ సంస్థ నిర్వాహకులు బోర్డు తిప్పేసి ఎవరికి కనిపించకుండా పారిపోతుండడంతో బాధితులు లబోదిబోమంటున్నారు.

రూ.కోట్లు పెట్టుబడిపెట్టి నష్టపోయిన పాలకుర్తి వాసులు

టాస్క్‌ఫోర్స్‌ పోలీసుల అదుపులో

హెప్సిబా, ఆర్‌జీఎఫ్‌ నిర్వాహకులు

రెండు సంవత్సరాలుగా పాలకుర్తి కేంద్రంగా అక్రమంగా నడుస్తున్న ఈ సంస్థల్లో నిర్వాహకులు రూ.కోట్లలో పెట్టుడులు పెట్టిస్తున్నా పోలీసులు ప్రేక్షకపాత్ర పోషించారు. అత్యాశకు పోయి నిరుద్యోగులు, అమాయకులు ఇందులో చేరి డబ్బులు పోగొట్టుకున్నా నోరు మెదపడం లేదు. ఈ విషయంపై పోలీసులు ప్రజలకు అవగాహన కల్పించడం లేదన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈ సంస్థపై ప్రారంభంలోనే చర్యలు తీసుకుంటే చాలా మంది ప్రజలు మోసపోయేవారు కాదని పలువురు అభిప్రాయపడుతున్నారు.

కోటీశ్వరులను చేస్తామని కొల్లగొట్టారు..1
1/1

కోటీశ్వరులను చేస్తామని కొల్లగొట్టారు..

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement