హన్మకొండ కల్చరల్: సద్దుల బతుకమ్మ వేడుకలు ఈ నెల 29న నిర్వహించుకోవాలని వరంగల్ శ్రీరాజరాజేశ్వరి దేవాలయ అర్చకుడు ఎల్లంభట్ల లక్ష్మణశర్మ బుధవారం ఒక ప్రకటనలో సూచించారు. ఈ నెల 21న ఎంగిలిపూల బతుకమ్మతో ప్రారంభమైందని, 9వరోజు సద్దుల బతుకమ్మతో ఉత్సవం ముగుస్తుందని పేర్కొన్నారు.
ఫార్మసీ యాక్ట్ అమలు చేయాలి
● రాష్ట్ర ఫార్మసీ కౌన్సిల్ మాజీ ఉపాధ్యక్షుడు ఉప్పు భాస్కర్‌రావు
ఎంజీఎం: ఫార్మసీ వృత్తిని ప్రభుత్వాలు గుర్తించాలని రాష్ట్ర ఫార్మసీ కౌన్సిల్ మాజీ ఉపాధ్యక్షుడు ఉప్పు భాస్కర్‌రావు అన్నారు. గురువారం ప్రపంచ ఫార్మసిస్టుల దినోత్సవాన్ని పురస్కరించుకుని ఆయన మాట్లాడారు. తెలంగాణలో 17 డిప్లొమా, 136 డిగ్రీ, బీఫార్మసీ, 42 ఫార్మ్‌డీ (డాక్టర్ ఆఫ్ ఫార్మసీ) కళాశాలలు ఉన్నాయన్నారు.
ఫార్మసీ కోర్సు పూర్తి చేసుకున్న వారికి ఫార్మసీ కళాశాలలో బోధన సిబ్బందిగా, డ్రగ్ కంట్రోల్ శాఖలో డ్రగ్ ఇన్‌స్పెక్టర్‌గా, ప్రభుత్వ ఆస్పత్రుల్లో ఫార్మసీ ఆఫీసర్లుగా, డ్రగ్ టెస్టింగ్ ల్యాబ్‌ల్లో అనలిస్ట్‌లుగా, ప్రైవేట్ ఫార్మా కంపెనీల్లో ఉద్యోగ, ఉపాధి అవకాశాలు ఉంటాయని తెలిపారు. ఫార్మసీ యాక్ట్ క్షేత్రస్థాయిలో అమలు చేయాలని ఆయన కోరారు.