
భద్రకాళికి సింహవాహన, గజవాహన సేవలు
చంద్రఘంటా అలంకరణలో పద్మాక్షి అమ్మవారు
రోహిణినిత్యగా శ్రీరాజరాజేశ్వరీదేవి అమ్మవారు
రోహిణినిత్యగా
శ్రీరాజరాజేశ్వరీదేవి
అమ్మవారు
హన్మకొండ కల్చరల్ : వరంగల్ ఎంజీఎం ఎదురుగా ఉన్న శ్రీరాజరాజేశ్వరీదేవి ఆలయంలో బుధవారం దేవీశర్నవరాత్రి ఉత్సవాలలో భాగంగా ఆలయ అర్చకులు ఎల్లంభట్ల లక్ష్మణశర్మ ఆధ్వర్యంలో అమ్మవారిని రోహిణినిత్యగా అలంకరించి నిత్యాక్లిన్న క్రమంలో పూజలు జరిపారు. ఆలయ చైర్మన్ వద్దిరాజు వెంకటేశ్వరరావు పర్యవేక్షించారు.
చంద్రఘంటా అలంకరణలో పద్మాక్షీ దేవి
హన్మకొండ అర్బన్ : పద్మాక్షీ దేవి చంద్రఘంటా అలంకరణలో భక్తులకు దర్శనమిచ్చినట్లు ఆలయ పండితులు నాగిళ్ల షణ్ముఖ పద్మనాభ అవధాని తెలిపారు. అమ్మవారికి షో డశ కలశాలతో మహోనారాయణోపనిషత్తుతో అభిషేకం నిర్వహించి అలంకరించినట్లు తెలిపారు. అనంతరం హోమాన్ని నిర్వహించిన ట్లు పేర్కొన్నారు. దాతలు కీర్తి ఉమెన్ చిల్డ్రన్ హా స్పిటల్ ముక్కా దిలీప్–అర్చన, మాధవరావు–మాధవి దంపతులు పూజా కార్యక్రమాల్లో పాల్గొన్నారు.
హన్మకొండ కల్చరల్: భద్రకాళి దేవాలయంలో జరుగుతున్న శరన్నవరాత్రి ఉత్సవాలు బుధవారం మూడో రోజుకు చేరాయి. ఆలయ ప్రధానార్చకుడు శేషు ఆధ్వర్యంలో అర్చకులు నిత్యాహ్నికం జరిపి అమ్మవారి మూలమూర్తిని గాయత్రీమాతగా అలంకరించారు. ఉదయం చంద్రఘంటా క్రమంలో దుర్గార్చన జరిపి సింహవాహనంపై, సాయంత్రం మహిషాసురమర్ధిని క్రమంలో దుర్గార్చన జరిపి గజవాహనంపై ఊరేగించారు. కుడా చైర్మన్ ఇనుగాల వెంకట్రాంరెడ్డి అమ్మవారిని దర్శించుకున్నారు. మధ్యాహ్నం, రాత్రి భక్తులకు అన్నప్రసాదాల వితరణ చేశారు. ఆలయ ఈఓ రామల సునీత పర్యవేక్షించారు.

భద్రకాళికి సింహవాహన, గజవాహన సేవలు

భద్రకాళికి సింహవాహన, గజవాహన సేవలు