
జిల్లాకు అన్యాయం..
ఆర్థికమంత్రి సహా ముగ్గురు మంత్రులు ఉన్నా కేటాయింపుల్లో అన్యాయం జరిగింది. సీతారామ ప్రాజెక్టుకు రూ.699 కోట్లు కేటాయించడమే దీనికి నిదర్శనం. ఈ నిధులు పెంచి, జనరల్ యూనివర్సిటీ మంజూరు చేయాలి.
– నున్నా నాగేశ్వరరావు, జిల్లా కార్యదర్శి, సీపీఎం
గ్యారంటీల ప్రస్తావన ఏదీ?
ఎన్నికల వేళ ఇచ్చిన హామీలు చేయలేక ఈ ప్రభుత్వం పారిపోతున్నట్లుగా బడ్జెట్ ద్వారా స్పష్టమైంది. ఆరు గ్యారంటీలు సహా ఇతర పథకాలకు సరైన కేటాయింపులే లేవు. గత ఏడాదితో పోలిస్తే ఈసారి బడ్జెట్ బాగుంటుందనుకుంటే నిరాశే ఎదురైంది. – కొండపల్లి శ్రీధర్‌రెడ్డి,
బీజేపీ కిసాన్ మోర్చా రాష్ట్ర అధ్యక్షుడు
అన్ని వర్గాలకు అసంతృప్తే...
బడ్జెట్ అన్ని వర్గాల ప్రజలను అసంతృప్తికి గురిచేసింది. ఆరు గ్యారంటీలకు గ్యారంటీ లేకపోగా, వ్యవసాయ, సంక్షేమ రంగాల్లో ఎలాంటి పురోగతి కనిపించలేదు. వైద్య రంగానికి సైతం తగిన ప్రాధాన్యత ఇవ్వలేదు. ఇక మహిళలకు ఇచ్చిన హామీల ఊసే లేదు.
– బానోతు చంద్రావతి, వైరా మాజీ ఎమ్మెల్యే
●

జిల్లాకు అన్యాయం..

జిల్లాకు అన్యాయం..