
మైసూరు హత్య కేసులో అరెస్టులు
మైసూరు: నగరంలోని దొడ్డకెరె మైదానం వద్ద మంగళవారం పట్టపగలే వెంకటేష్ అనే వ్యక్తిని కొడవళ్లతో నరికి చంపిన ఘటనలో ఐదుగురిని పోలీసులు అరెస్టు చేశారు. మనోజ్ అలియాస్ బిగ్ షో, మల్లికార్జున అలియాస్ హాలప్ప, మరో ముగ్గురిని నిర్బంధించారు. ఇటీవల జరిగిన కార్తీక్ అనే వ్యక్తి హత్య తర్వాత జరిగిన పరిణామాలు వెంకటేష్ హత్యకు కారణాలుగా తెలుస్తోంది. వెంకటేష్‌ని అంతమొందిస్తున్న ఫోటోలు, వీడియోలను తీసి కొందరు వైరల్ చేశారు. వాటి ఆధారంగా పోలీసులు నిందితులను సులభంగా గుర్తించారు. ఉత్సవ వాతావరణంతో ఉన్న మైసూరులో ఈ హత్య భయాందోళన కలిగించింది.
నరుకుతున్న దుండగులు