
బెంగళూరు పోస్టాఫీసులకు డ్రగ్స్ పార్శిళ్లు
న్యూస్‌రీల్
పోస్టాఫీసులపై గట్టి నిఘా: కమిషనర్
బనశంకరి: సిలికాన్ సిటీ మత్తు పదార్థాలకు అడ్డా గా మారిందనే ఆందోళనకు ఊతమిచ్చేలా తరచూ పెద్ద మొత్తంలో డ్రగ్స్ పట్టుబడుతున్నాయి. పోస్టులు, పార్శిల్స్‌ను ప్రజలకు అందించే విదేశీ పోస్టాఫీసులను పెడ్లర్లు వాడుకుంటున్నారు. ఇటీవల సుమారు రూ.20 కోట్ల డ్రగ్స్‌ను పట్టుకుని పలువురిని అరెస్టు చేసిన నగర పోలీసులు బుధవారం మరో 6 మందిని నిర్బంధించి రూ. రూ.23.84 కోట్ల విలువచేసే డ్రగ్స్ స్వాధీనం చేసుకున్నారు. నిందితుల్లో ఇద్దరు ఆఫ్రికన్లు ఉన్నట్లు నగర పోలీస్ కమిషనర్ సీమంత్‌కుమార్‌సింగ్ తెలిపారు. సీసీబీ, ఉత్తర, తూర్పు, దక్షిణ విభాగం పోలీసులు గాలింపు జరిపి నిందితులను పట్టుకున్నట్లు తెలిపారు. 7.17 కేజీల హైడ్రోగంజాయి, 1.39 కేజీల ఎండీఎంఏ క్రిస్టల్, 2.3 కిలోల హఫీమ్ ఇందులో ఉన్నాయి. మరికొన్ని మత్తు పదార్థాలు కూడా స్వాధీనం చేసుకున్నామని తెలిపారు. దొడ్డబళ్లాపురవాసి నాగదేనహళ్లి సురేశ్, మనోజ్, అత్తిబెలె అఖిల్ సంతోష్, కనకపుర సోమశేఖర్, కళ్యాణనగర దిలీప్‌కుమార్ సాహు, సూడాన్‌వాసి లాడూరామ్ తదితర ఆరుమంది పట్టుబడ్డారు.
విదేశీ మహిళ వద్ద..
పరప్పన అగ్రహారలో రాజస్థాన్ కు చెందిన డ్రగ్స్‌పెడ్లర్ ను అరెస్ట్ చేసి విచారించగా, జల్సాల కోసం డ్రగ్స్ దందా చేస్తున్నట్లు తెలిపాడు. ఇతని నుంచి రూ.4 కోట్ల విలువచేసే 1కిలోకు పైగా ఎండీఎంఏ క్రిస్టల్, 2 కిలోలకు పైగా హఫీంను సీజ్ చేశారు. కొత్తనూరు పోలీసులు ఎన్‌జీ.గొల్లహళ్లిలో ఓ అపార్టుమెంట్‌లో విదేశీ మహిళను అరెస్టు చేసి రూ.12.03 కోట్ల విలువైన 4 కిలోల 815 గ్రాముల ఎండీఎంఏ క్రిస్టల్ ను వశపరచుకున్నారు.
పోస్టాఫీసులో జాగిలాలతో తనిఖీ..
విదేశాల నుంచి డ్రగ్స్ తో కూడిన అనుమానాస్పద పార్శిల్స్ కేజీ.నగర పోలీస్‌స్టేషన్ పరిధిలో విదేశీ తపాలా కార్యాలయానికి వస్తున్నట్లు గుర్తించారు. జాగిలాలతో పార్శిల్స్‌ను తనిఖీలు చేయగా రూ.3.81 కోట్ల విలువచేసే 3 కిలోల హైడ్రో గంజాయి, ఇతర డ్రగ్స్ పార్శిల్స్‌ను గుర్తించాయి. కొందరు గుర్తుతెలియని వ్యక్తులు థాయ్‌లాండ్, జర్మనీ దేశాల నుంచి నకిలీ పేర్లతో క్రిప్టోకరెన్సీ ద్వారా హైడ్రోగంజాయిని పార్శిల్ తెప్పించారని తేలింది.
పెడ్లర్ల నుంచి స్వాధీనం చేసుకున్న వివిధ మాదకద్రవ్యాలు
నిందితుల నుంచి పట్టుకున్న మత్తు పదార్థాలు
వాటిపై నిరంతరం కన్నేస్తాం
పోలీస్ కమిషనర్ సీమంత్‌కుమార్‌సింగ్
మరో 6 మంది డ్రగ్‌పెడ్లర్ల అరెస్టు
రూ.23 కోట్లకు పైగా డ్రగ్స్ స్వాధీనం
బెంగళూరులో ఫారిన్ పోస్టాఫీసులకు డ్రగ్స్ పార్శిల్స్ రావడాన్ని తీవ్రంగా పరిగణించామని పోలీసు కమిషనర్ తెలిపారు. ఆయన విలేకరులతో మాట్లాడుతూ ఆ తపాలా ఆఫీసు అధికారులు సిబ్బంది డ్రగ్స్ ముఠాలతో కుమ్మక్కయ్యారా అనే దానిపై దర్యాప్తు చేస్తున్నామని చెప్పారు. కెంపేగౌడ నగర పోలీస్‌స్టేషన్ పరిధిలో విదేశీ తపాలా ఆఫీసుకు కూడా తరచూ విదేశాల డ్రగ్స్ పార్శిల్ వస్తుంటే ఎలాంటి చర్యలు తీసుకున్నారు అని విలేకరులు ఆయనను ప్రశ్నించారు. ఇప్పటికే పోస్టల్ అధికారులతో డీసీపీ ఒకసారి చర్చించారని తెలిపారు. తపాలాఫీసులకు వచ్చే పార్శిల్స్ పై నిఘాపెడతామన్నారు. డ్రగ్స్ కట్టడిలో తమకు కేంద్ర సంస్థలు, బయటి రాష్ట్రాల పోలీసులు సహకారం అందిస్తున్నారని తెలిపారు. బెంగళూరులో డ్రగ్స్ నివారణకు గట్టి చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు.

బెంగళూరు పోస్టాఫీసులకు డ్రగ్స్ పార్శిళ్లు

బెంగళూరు పోస్టాఫీసులకు డ్రగ్స్ పార్శిళ్లు

బెంగళూరు పోస్టాఫీసులకు డ్రగ్స్ పార్శిళ్లు