
సరికొత్తగా ఇబ్బలూరు జంక్షన్
కృష్ణరాజపురం: నిత్యం వేలాది వాహనాల రాకపోకలతో ఎప్పుడు బిజీగా ఉండే సిలికాన్ సిటీలోని ఇబ్బలూరు జంక్షన్ రూపురేఖలే మారిపోయాయి. ఎక్కడ చూసినా చెత్తాచెదారం, మురుగునీటితో విసుగు తెప్పించే ఈ ప్రదేశం కొత్తగా సింగారించుకుంది. ఎంతో శుభ్రంగా, రంగులమయంగా మారడంతో ప్రజలు ఆశ్చర్యపోతున్నారు. మహదేవపుర టాస్క్‌ఫోర్స్, పాలికె, ఇంకా వివిధ సంస్థల సభ్యులు కలిసి ఈ పనికి నడుంబిగించారు. బుధవారం ఈ జంక్షన్‌లో ఉన్న చెత్తను తొలగించి, పిల్లర్లకు రంగులు వేశారు. యువతులు, మహిళలు ముగ్గులు వేసి ఆకర్షణీయంగా తీర్చిదిద్దారు. స్థానిక మాజీ మంత్రి అరవింద లింబావళి మాట్లాడుతూ మన మహదేవపురను స్వచ్ఛంగా, సుందరంగా, హరితవనంగా మార్చేందుకు అందరూ కలిసి నడవాలనని విజ్ఞప్తి చేశారు.
చెత్తను తొలగించి సుందరీకరణ

సరికొత్తగా ఇబ్బలూరు జంక్షన్

సరికొత్తగా ఇబ్బలూరు జంక్షన్