
రాజధానిలో మళ్లీ జడివాన
యశవంతపుర: కొన్నిరోజుల విరామం తరువాత ఉద్యాన నగరంలో బుధవారం మధ్యాహ్నం జోరుగా వర్షం కురిసింది. యలహంకతో పాటు మల్లేశ్వరం, శేషాద్రిపురం, మెజిస్టిక్ తదితర ప్రాంతాలలో జడివాన రావడంతో జనం తడవకుండా పరుగులు తీశారు. గుంతల రోడ్లపై నీళ్లు నిలవడంతో ద్విచక్ర వాహనదారులు అవస్థలు పడ్డారు. యలహంకలో జలావృతం అయ్యాయి. కాఫీ డే వద్ద ఎక్కువగా వాన నీరు నిలవడంతో వాహనాలను మరో మార్గంలోకి మళ్లించారు. కిలోమీటర్ల కొద్దీ వాహనాలు చిక్కుకున్నాయి. యలహంక రైల్వేఅండర్ పాస్ వద్ద మూడు అడుగుల ఎత్తు నీరు నిలిచిపోవడంతో బెంగళూరు సిటీలోకి వాహనాలు రాలేకపోయాయి. వీరసంద్ర జంక్షన్ వద్ద నీళ్లు నిలవడంతో హోసూరుకు వాహనాలు నెమ్మదిగా సాగాయి. రెండు మూడు రోజుల పాటు బెంగళూరులో వానలు పడవచ్చని వాతావారణశాఖ అధికారులు తెలిపారు.

రాజధానిలో మళ్లీ జడివాన