
పెద్దలను గౌరవించాలి
రాయచూరు రూరల్: కుటుంబంలోని పెద్దలను గౌరవించడం మన సంప్రదాయమని శాసన సభ్యుడు శివరాజ్ పాటిల్ అన్నారు. బుధవారం కన్నడ భవనంలో జరిగిన ప్రపంచ పెద్దల దినోత్సవంలో పాల్గొని ఆయన మాట్లాడారు. నేడు ఒత్తిళ్ల మధ్య ఉరుకులు పరుగుల జీవితంలో సమాజంలో పెద్దలకు గౌరవం లభించడం లేదన్నారు. తల్లిదండ్రులను గౌరవించలేని పరిస్థితులు దాపురించాయన్నారు. అవిభక్త కుటుంబంలో ఉన్న తేడాలను గురించి వివరించారు. గతంలో వారు పడిన కష్టాలు నేటి పిల్లలు పడరన్నారు. ఏసీ గజానన, నగరసభ అధ్యక్షురాలు నరసమ్మ, అధికారులు శరణమ్మ, శ్రీదేవి, పవన్ కుమార్ పాటిల్, మహదేవప్ప, రామణ్ణలున్నారు.
పొలాల్లో
రాళ్లు వేయడం సరికాదు
రాయచూరు రూరల్: పొలంలో రైతుల అనుమతి లేకుండా అధికారులు బండరాళ్లు వేయడం సరికాదని కరవే డిమాండ్ చేసింది. బుధవారం సిరవార తహసీల్దార్ కార్యాలయం వద్ద చేపట్టిన ఆందోళనలో అధ్యక్షుడు రాఘవేంద్ర ఖాజనగౌడ మాట్లాడారు. జాతీయ రహదారి– 748ఏ భాగంగా రహదారి నిర్మాణానికి అధికారులు భూస్వాధీన ప్రక్రియలో భాగంగా పొలాలకు బండరాళ్లను వేశారని, వాటిని తొలగించి రైతులకు సత్వర న్యాయం జరిగేలా చూడాలని కోరుతూ తహసీల్దార్ ద్వారా రాష్ట్ర గవర్నర్‌కు వినతిపత్రం సమర్పించారు. ఆందోళనలో సిద్దలింగేశ్వర, మహ్మద్, హుచ్చప్ప, శశిరాజ్, మల్లయ్య, శివప్ప, ఇస్మాయిల్, నరసప్ప, పంపణ్ణలున్నారు.
అవినీతి అధికారులపై
వేటు వేయండి
రాయచూరు రూరల్: దేవదుర్గ తాలూకాలో వివిధ అభివృద్ధి పనులు చేపట్టడానికి మంజూరు చేసిన నిధులను స్వాహా చేసిన నలుగురు అధికారులను సస్పెండ్ చేయాలని ఆర్‌టీఐ కార్యకర్త అళ్లప్ప డిమాండ్ చేశారు. బుధవారం పాత్రికేయుల భవనంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. దేవదుర్గ తాలూకాలోని జాలహళ్లిలో పదేళ్ల క్రితం ప్రభుత్వ అతిథి భవనాల మరమ్మతుకు ప్రభుత్వం రూ.4.40 లక్షల నిధులను విడుదల చేసిందన్నారు. పనులు చేయకుండా నిధులు నొక్కేశారన్నారు. ఈ విషయంలో సమాచారం అందించాలని పంచాయతీరాజ్, ప్రజాపనుల శాఖ, ఐబీ, రహదారుల శాఖ అధికారులకు ఫిర్యాదు చేయగా విచారణ పేరుతో కాలయాపన చేశారని తెలిపారు. దశాబ్దం తర్వాత కమిషన్ విచారణ చేయడానికి పిలిచిందన్నారు. అధికారులు ఉన్నారో లేదో కమిషన్‌కు ఫిర్యాదు చేసిన వ్యక్తి మరణించాడో తెలుసుకోకుండా విచారణకు పిలవడం గమనార్హమన్నారు.
గంజాయి స్వాధీనం
హోసూరు: హోసూరు సమీపంలో మంగళవారం రాత్రి మద్య నిషేధక శాఖ పోలీసులు నాలుగు కిలోల గంజాయి స్వాధీనం చేసుకున్నారు. వివరాల మేరకు హోసూరు మద్య నిషేధ శాఖ ఇన్‌స్పెక్టర్ షర్మిల భాను నేతృత్వంలో పోలీసులు హోసూరు–బెంగళూరు జాతీయ రహదారి జూజువాడి చెక్ పోస్ట్ ప్రాంతంలో వాహన తనిఖీలు నిర్వహించారు. ఈ సమయంలో ఆ మార్గంలో ద్విచక్ర వాహనంలో వెళ్తున్న వ్యక్తిని అడ్డగించి తనిఖీ చేయగా.. నాలుగు కిలోల గంజాయి పట్టుబడింది. పోలీసులు గంజాయి స్వాధీన చేసుకుని నిందితుడిని అరెస్ట్ చేసి విచారించారు. దిండుకల్ జిల్లా గొల్లంబట్టి గ్రామానికి చెందిన విజయ్ అని తెలిసింది. ఇతడిపై కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు.

పెద్దలను గౌరవించాలి

పెద్దలను గౌరవించాలి