
రెండో శ్రీశైలం.. మల్లికార్జున ఆలయం
రాయచూరు రూరల్: భారతీయ సంస్కృతికి ఆనవాలుగా ఉన్న క్షేత్రాల్లో దక్షిణ భారత ప్రాంతంలో శ్రీశైలం మహా పుణ్య క్షేత్రంగా వెలసింది. అదే కోవకు చెందిన పురాతన ఆలయం రాయచూరు జిల్లాలో వెలసింది. జిల్లా కేంద్రమైన రాయచూరుకు ఐదు కి.మీ.దూరంలో ఉన్న బోళమానుదొడ్డి గ్రామంలో మల్లికార్జున భ్రమరాంబిక దేవి ఆలయం ఉంది. విజయ నగర రాజుల పాలన కాలంలో దేవాలయం నిర్మించారని చరిత్ర ద్వారా తెలుస్తోంది. శ్రీశైలంలో మాదిరిగా మల్లికార్జున విగ్రహం, గణపతి దేవుడు, భ్రమరాంబిక విగ్రహం, అక్క మహాదేవి విగ్రహాలు చూడముచ్చటగా ఉన్నాయి. నగర ప్రజలకు ఇలాంటి ఆలయం ఒకటి ఉన్నట్లు కూడా తెలియదు. మహా శివరాత్రి సందర్భంగా భక్తులు మౌన వ్రతం పాటించేందుకు పాతబడిన ఆలయంలో వెళ్లి పరిశీలించగా వాస్తవాలు బయట పడ్డాయి. నాటి నుంచి భక్తుల సంఖ్య అధికమైంది. ఈ విషయంలో గ్రీన్ రాయచూరు సంచాలకుడు రాజేంద్ర కుమార్ శివాళే శ్రద్ధ కనబరిచి దేవాలయం అభివృద్ధికి చొరవ చూపారు. శ్రీశైలం వెళ్లలేని వారికి బోళమానుదొడ్డి మల్లికార్జున భ్రమరాంబిక దేవాలయాన్ని దర్శించుకోడానికి అవకాశం కల్పించారు.
బోళమానుదొడ్డి గ్రామంలో వెలసిన వైనం
విజయనగర రాజులు నిర్మించినట్లు ప్రతీతి

రెండో శ్రీశైలం.. మల్లికార్జున ఆలయం

రెండో శ్రీశైలం.. మల్లికార్జున ఆలయం

రెండో శ్రీశైలం.. మల్లికార్జున ఆలయం