
సుప్రీంకోర్టు జడ్జిపై దాడి తగదు
రాయచూరు రూరల్: సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి భూషణ్ రామకృష్ణపై దాడి చేయడం తగదని జిల్లా న్యాయవాదుల సంఘం పేర్కొంది. బుధవారం జిల్లాధికారి కార్యాలయం వద్ద చేపట్టిన ఆందోళనలో అధ్యక్షుడు మల్లికార్జున మాట్లాడారు. సుప్రీంకోర్టులో న్యాయవాదిగా పని చేస్తున్న రాకేష్‌ను కఠినంగా శిక్షించాలన్నారు. న్యాయవాదులు కోర్టు కలాపాలను బ హి ష్కరించి సుప్రీంకోర్టు న్యాయమూర్తిని అవమాన పరిచిన రాకేష్‌పై చర్యలు తీసుకోవాలని కోరుతూ జిల్లాధికారి నితీష్ ద్వారా రాష్ట్రపతికి వినతిపత్రం సమర్పించారు. ఆందోళనలో లక్ష్మప్ప, నజీర్, శ్రీకాంత్, శివశంకర్, జగదీష్, అంబాపతి, నాగరాజ్, పాండురంగ నాయక్, రామనగౌడ, వీరభద్రప్ప, ప్రభాకర్, మున్నాలున్నారు.
దాడి అమానుషం
సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిపై దాడి చేయడం అమానుషమని దళిత పర సంఘాలు బలంగా ఖండించాయి. బుధవారం అంబేడ్కర్ సర్కిల్ వద్ద ఆందోళన చేపట్టిన అధ్యక్షుడు రవీంద్రనాథ్ పట్టి మాట్లాడారు. సుప్రీం కోర్టు దేశానికి సర్వోన్నత న్యాయస్థానంగా పేరొందిందన్నారు. అలాంటి కోర్టులో న్యాయవాదిగా పని చేస్తున్న రాకేష్‌ను కఠి నంగా శిక్షించాలన్నారు. నిందితుడు రాకేష్‌పై చర్యలు తీసుకోవాలని కోరారు. సుమారు అర గంట సేపు అంబేడ్కర్ సర్కిల్ వద్ద రాస్తారోకో జరిపి నిరసన వ్యక్తం చేశారు. ఆందోళనలో విరుపాక్షి, విజయరాణి, నరసింహులు, శ్రీనివాస్‌లున్నారు.
జడ్జిపై దాడిని ఖండిస్తూ నిరసన
బళ్లారి రూరల్ : సుప్రీంకోర్టులో విధులు నిర్వహిస్తున్న ముఖ్య న్యాయమూర్తి బీ.ఆర్.గవాయిపై ఈ నెల 6న న్యాయవాది రాకేశ్ కిశోర్ బూటు విసరటానికి ప్రయత్నించిన ఘటనను ఖండిస్తూ నిరసనగా బుధవారం నగరంలో దళిత సంఘాలు ర్యాలీని నిర్వహించి జిల్లా యంత్రాంగం ద్వారా భారత ప్రధాని, రాష్ట్రపతికి వినతిపత్రాన్ని సమర్పించారు. పెద్ద సంఖ్యలో దళితులు ప్రధాన నగర వీధుల్లో ర్యాలీ చేపట్టారు. ర్యాలీలో జిల్లా బీ.ఆర్.అంబేడ్కర్ సంఘం, డీఎస్‌ఎస్(దళిత సంఘర్షణ సమితి) ప్రముఖులు ఏ.మానయ్య, కే.దేవదాస్, హెచ్.బీ.గంగప్ప, బీ.కే.అనంతకుమార్, బీ.ఏ.మల్లేశ్వరి, హులిగప్ప, కే.గాదిలింగ తదితరులు పాల్గొన్నారు.

సుప్రీంకోర్టు జడ్జిపై దాడి తగదు

సుప్రీంకోర్టు జడ్జిపై దాడి తగదు