
ముగిసిన ఫారెస్ట్ క్రీడా పోటీలు
కరీంనగర్‌స్పోర్ట్స్: కరీంనగర్ ప్రాంతీయ క్రీడాపాఠశాల మైదానంలో రెండు రోజులుగా జరుగుతున్న అటవీశాఖ ఉద్యోగుల రీజినల్ క్రీడా పోటీలు బుధవారం ముగిశాయి. రాజ న్న జోన్‌లోని కరీంనగర్, కామారెడ్డి, సిద్దిపే ట, మెదక్, రాజన్న సిరిసిల్ల జిల్లాల నుంచి 400మంది క్రీడాకారులు హాజరై ప్రతిభ చాటారు. అన్ని క్రీడలలో అధిక పాయింట్లు సాధించి సిద్దిపేట జిల్లా జోన్ ఓవరాల్ ఛాంపియన్‌గా నిలిచింది. విజేతలకు కరీంనగర్ డీఎఫ్‌వో బాలామణి, కామారెడ్డి డీఎఫ్‌వో బోగాని నిఖిత, మెదక్ డీఎఫ్‌వో జోజి పతకాలు ప్రదానం చేశారు. ప్రతిభ చూపినవారిని వచ్చేనెలలో జరిగే రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపిక చేశారు. డీవైఎస్‌వో వి.శ్రీనివాస్‌గౌడ్ పాల్గొన్నారు.
కరీంనగర్ కార్పొరేషన్: నగరంలో ఆరు బయట చెత్త వేస్తున్న, అపరిశుభ్ర వాతావరణంలో వ్యాపారాలు నిర్వహిస్తున్న వారిపై నగరపాలకసంస్థ చర్యలు కొనసాగుతున్నాయి. నగరంలోని ఫారెస్ట్ ఆఫీసు సమీపంలోని పండ్ల దుకాణాలు, చికెన్‌సెంటర్‌ను నగరపాలకసంస్థ అధికారులు బుధవారం తనిఖీ చేశారు. పరిశుభ్రత పాటించకుండా చికెన్ విక్రయాలు చేస్తున్న చికెన్ సెంటర్ నిర్వాహకుడికి రూ.20 వేలు జరిమానా విధించారు. పరిశుభ్రత పాటించని ఐదు పండ్ల దుకాణాలకు రూ.3 వేలు చొప్పున జరిమానా విధించారు. ప్రతి దుకాణదారుడు చెత్తబుట్టను వినియోగించాలని, పరిసరాల్లో చెత్తవేస్తే జరిమానా విధిస్తామని హెచ్చరించారు.
కొత్తపల్లి: విద్యుత్ లైన్లు, చెట్ల కొమ్మల తొలగింపు పనులు కొనసాగుతున్నందున గురువారం ఉదయం 10.30 నుంచి మధ్యాహ్నం 2.30 గంటల వరకు 33/11 కేవీ రేకుర్తి సబ్‌స్టేషన్ పరిధిలోని రేకుర్తి, సీతారాంపూర్, జగి త్యాల రోడ్‌లో సరఫరా నిలిపివేస్తున్నట్లు రూరల్ ఏడీఈ గాదం రఘు తెలిపారు.

ముగిసిన ఫారెస్ట్ క్రీడా పోటీలు