
సందర్శించి.. పాఠం చదివించి
కరీంనగర్‌రూరల్: ప్రభుత్వ పాఠశాలల్లో బుధవారం బోధన కార్యక్రమానికి ప్రాధాన్యం ఇవ్వడంతోపాటు విద్యార్థులకు కఠిన అంశాలు, పాఠాలు నేర్పించాలని కలెక్టర్ పమేలా సత్పతి ఉపాధ్యాయులకు సూచించారు. కరీంనగర్ మండలం నగునూరు జెడ్పీ, మండల పరిషత్ పాఠశాలలను బుధవారం సందర్శించారు. బుధవారం బోధనలో భాగంగా 10వ తరగతి విద్యార్థులు నేర్చుకుంటున్న అంశాలను పరిశీలించారు. విద్యార్థులతో ఇంగ్లిష్ పాఠాలు చదివించారు. అన్ని పాఠశాలల్లో బుధవారం బోధన పకడ్బందీగా అమలు చేయాలన్నారు. అనంతరం తరగతి గదులు, వంటగది, విటమిన్ గార్డెన్ పరిశీలించారు. మధ్యాహ్న భో జనం నాణ్యతను తనీఖీ చేశారు. అంగన్‌వాడీ కేంద్రం, పల్లె దవాఖానాలను సందర్శించారు. జిల్లా వైద్యాధికారి వెంకటరమణ, ప్రోగ్రాం అధికారి సనా, తహసీల్దార్ రాజేశ్, ఎంఈవో రవీందర్, ప్రధానోపాధ్యాయుడు తిరుపతిరావు పాల్గొన్నారు.