పత్తిరైతు పరేషాన్‌ | - | Sakshi
Sakshi News home page

పత్తిరైతు పరేషాన్‌

Oct 8 2025 6:27 AM | Updated on Oct 8 2025 6:27 AM

పత్తి

పత్తిరైతు పరేషాన్‌

● అధిక వర్షాలతో దెబ్బతిన్న తెల్లబంగారం ● ముసురు ప్రభావంతో నిలవని పూత, పిందె ● చేలల్లో పదనతో చీడపీడల ఉధృతి ● ఆకుముడతతో ఎర్రబారుతున్న మొక్కలు బయోమైనింగ్‌ ఏజెన్సీకి రూ.3.25 లక్షల జరిమానా ● జిల్లా విద్యాధికారి శ్రీరామ్‌ మొండయ్య

న్యూస్‌రీల్‌

● అధిక వర్షాలతో దెబ్బతిన్న తెల్లబంగారం ● ముసురు ప్రభావంతో నిలవని పూత, పిందె ● చేలల్లో పదనతో చీడపీడల ఉధృతి ● ఆకుముడతతో ఎర్రబారుతున్న మొక్కలు

సాక్షిప్రతినిధి, కరీంనగర్‌: డంప్‌యార్డ్‌లో చెత్తను తగ్గించే బయోమైనింగ్‌ పనుల్లో అలసత్వం వహిస్తున్న సంబంధిత ఏజెన్సీకి బల్దియా రూ.3.25 లక్షలు జరిమానా విధించింది. ‘బయోమైనింగ్‌ దుబారా’ పేరిట మంగళవారం ‘సాక్షి’లో ప్రచురితమైన కథనానికి నగరపాలకసంస్థ అధికారులు స్పందించారు. ప్రణాళిక ప్రకారం పనులు జరుగుతున్నా, ఏజెన్సీలో నిధుల కొరత కారణంగా పనులు పూర్తిస్థాయిలో కాలేదని ఎస్‌ఈ రాజ్‌కుమార్‌ తెలిపారు. ఒప్పందం మేరకు పనులు చేయడంలో అలసత్వం జరుగుతున్నందున, ఏజెన్సీకి జరిమానా విధించినట్లు పేర్కొన్నారు. అలాగే నిధుల వినియోగం మార్చిలోపు జరగాల్సి ఉండడంతో, ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు టెండర్‌ పిలిచామన్నారు. ప్రస్తుత ఏజెన్సీ గడువు కూడా త్వరలో ముగుస్తున్నందున పనులు త్వరిగతిన చేపట్టాల్సి ఉండడంతో టెండర్‌ పిలిచినట్లు వివరించారు. ఇటీవల కురుస్తున్న భారీ వర్షాల కారణంగా, పనులు నిలిచిపోయాయన్నారు. డంప్‌యార్డ్‌లో ప్రస్తుతం 3 లక్షల మెట్రిక్‌టన్నుల వ్యర్థాలు నిలువ ఉన్నాయన్నారు. ప్రతీరోజు ట్రాక్టర్‌ల ద్వారా వ్యర్థాలు చేరుతున్నాయని, డంపింగ్‌ చేయడానికి కూడా ఇబ్బందులు వస్తున్నాయన్నారు. అందుకే వ్యర్థాలను తగ్గించడానికి బయోమైనింగ్‌ ప్రక్రియ ద్వారా రూ.2 కోట్లకు టెండర్‌ పిలిచినినట్లు వివరించారు.

విద్యాబోధనలో ఆధునిక సాంకేతికత

కొత్తపల్లి(కరీంనగర్‌): ప్రధానమంత్రి స్కూల్స్‌ ఆఫ్‌ రైజింగ్‌ ఇండియా(పీఎంశ్రీ యోజన) పథకం కింద ఎంపికై న జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాల విద్యార్థులకు ఆధునిక, డిజిటల్‌ టెక్నాలజీ, అత్యాధునిక మౌలిక వసతులతో నాణ్యమైన విద్య అందించడమే ప్రభుత్వ లక్ష్యమని జిల్లా విద్యాధికారి శ్రీరామ్‌ మొండయ్య అన్నారు. పీఎం శ్రీ యోజన కింద కొత్తపల్లి జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాలకు మంజూరైన అగ్మెంటెడ్‌ రియాలిటీ(ఏఆర్‌), వర్చువల్‌ రియాలిటీ(వీఆర్‌) టెక్నాలజీ సైన్స్‌ ల్యాబ్‌లను మంగళవారం ఆయన ప్రారంభించారు. డీఈవో మాట్లాడుతూ, ఆధునిక సాంకేతికతతో విద్యార్థుల అభ్యసన సామర్థ్యం, నైపుణ్యం, ఆత్మవిశ్వాసం పెరుగుతుందన్నారు. చరిత్ర, జీవ, భౌతికశాస్త్రాల్లో నూతన ప్రయోగాలు, ల్యాబ్‌ అనుకరణలు, వర్చువల్‌ టూల్స్‌ ద్వారా విద్యార్థులు చక్కగా పాఠాలు అభ్యసిస్తారని తెలిపారు. జ్ఞానసాధనలో గతంకన్నా అధిక ఆసక్తి చూపుతారని అరన్నారు. 3–డీ ప్రొజెక్షన్‌లు, ఇంటరాక్టివ్‌ హ్యాండ్సన్‌ అనుభవాలు విద్యా ప్రపంచాన్ని మరింత ఆకర్షణీయంగా, ప్రయోజనకరంగా మారుస్తాయని డీఈవో వివరించారు. జిల్లా సైన్స్‌ ఆఫీసర్‌ జయపాల్‌రెడ్డి, ప్లానింగ్‌ కో ఆర్డినేటర్‌ మిల్కూరి శ్రీనివాస్‌, ప్రధానోపాధ్యాయుడు కన్నం రమేశ్‌, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.

బకాయిలు ఇచ్చే వరకు ఉద్యమం

కరీంనగర్‌: పెన్షనర్ల బకాయిలు ఇచ్చేవరకు ఉద్యమాన్ని కొనసాగిస్తామని రిటైర్డు ఎంప్లాయీస్‌ వెల్ఫేర్‌ అసోసియేషన్‌(రేవా) ఉమ్మడి జిల్లా అధ్యక్షుడు కోహెడ చంద్రమౌళి స్పష్టంచేశారు. అసోసియేషన్‌ ఆధ్వర్యంలో మంగళవారం కలెక్టరేట్‌ ఎదుట ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా ఉమ్మడి జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు కోహెడ చంద్రమౌళి, సుంకిశాల ప్రభాకర్‌రావు మాట్లాడారు. ఏడాదిన్నరగా ఉద్యోగ విరమణ చేసిన వారికి రావాల్సిన బెనిఫిట్స్‌ అందలేదన్నారు. బకాయిలు రాక పిల్లల పెళ్లిల్ల్లు చేయలేక.. ఇల్లు కట్టుకోలేక అనారోగ్యంతో బాధపడుతున్నామన్నారు. నిరసనలో సంఘం జిల్లా ఉపాధ్యక్షులు గద్దె జగదీశ్వర చారి, ఎం. భారతి, కోశాధికారి కనపర్తి దివాకర్‌, జిల్లా కమిటీ సభ్యులు, ఉమ్మడి వరంగల్‌ జిల్లా అధ్యక్షుడు ఎస్‌.ధర్మేందర్‌, ప్రధాన కార్యదర్శి కె. భోగేశ్వర్‌, అసోసియేట్‌ ప్రెసిడెంట్‌ కె. దేవదాసు, సిద్దిపేట జిల్లా బాధ్యులు కిషన్‌ నాయక్‌, రాములు, జగిత్యాల జిల్లా నుంచి ఎం.రామిరెడ్డి, సిరిసిల్ల జిల్లా నుంచి మల్లారపు పురుషోత్తం, పెద్దపల్లి జిల్లా నుంచి సత్యనారాయణ తదితరులు హాజరయ్యారు.

సాక్షి,పెద్దపల్లి:

ఉమ్మడి జిల్లాలో ఇటీవల కురిసిన వానలు పత్తి రైతులను దెబ్బతీశాయి. సీజన్‌ ఆరంభంలో వర్షాభావం, ఆ తర్వాత ఎడతెరపిలేని వర్షాలు అన్నదాతను తెల్లబోయేలా చేశాయి. ముఖ్యంగా సెప్టెంబర్‌లో కురిసిన భారీవర్షాలకు పత్తి పంట ఎర్రబారింది. ప్రస్తుతం పూత, కాయ, దూదితో కళకళాడాల్సిన చేన్లు.. ఎక్కడా చూసినా తెగళ్లతో ఎర్రబారి కనిపిస్తున్నాయి. వాతావరణంలో మార్పులు, తేమశాతం అధికం కావడంతో చేలలో పదను తగ్గడం లేదు. వర్షపునీరు నిలిచి పత్తికాయలు రాలిపోవడమే కాకుండా మొక్కలు మురిగిపోతున్నాయి. ఇది దిగుబడిపై ప్రభావం చూపుతుందని రైతులు ఆందోళన చెందుతున్నారు. అన్నిరకాలుగా అనుకూలిస్తే ఎకరాకు 12 క్వింటాళ్ల నుంచి 20 క్వింటాళ్ల వరకు దిగుబడి వచ్చేదని, కానీ, అధిక వర్షాలతో 3 క్వింటాళ్ల నుంచి 4 క్వింటాళ్లు కూడా వచ్చే పరిస్థితి కనిపించడం లేదని అన్నదాతలు ఆవేదన చెందుతున్నారు. ఒక్కో రైతు ఎకరాకు రూ.35వేల వరకు పెట్టుబడి పెట్టాడు. ప్రస్తుత పరిస్థితుల్లో పెట్టుబడి కూడా వచ్చేట్టు లేదంటున్నారు.

రాలుతున్న కాత, పూత

భారీవర్షాలు, ముసురుతో చేలల్లో ఇంకా పదను తగ్గడం లేదు. ఫలితంగా రసం పీల్చే పురుగులు, పచ్చ, తెల్లదోమ, నల్లితో ఆకుముడుత, పండాకు, ఎండాకు వంటి తెగుళ్ల వ్యాప్తి అధికమైంది. పత్తి పూత, పిందె రాలిపోతుండటంతోపాటు కాయలు ఎర్రబారుతున్నాయి. ఎన్ని మందులు పిచికారీ చేసినా ఫలితం లేదని అన్నదాతలు వాపోతున్నారు.

సీజన్‌ ఆరంభంతోనే కష్టాలు..

పత్తి విత్తనాలు నాటే దశనుంచే రైతులకు కష్టాలు మొదలయ్యాయి. సీజన్‌ మొదట్లో వరణుడు ముఖం చాటేశాడు. విత్తిన విత్తనాలు భూమిలోనే కలిసిపోయాయి. రెండోసారి కొన్నిచోట్ల మళ్లీ విత్తనాలు వేశారు. ఎరువులు, పురుగులమందులు, కలుపుతీతకు భారీపెట్టుబడి పెట్టారు. తీరా పంట చేతికొస్తున్న దశలో భారీ వర్షాలు దెబ్బతీశాయి.

పత్తిరైతు పరేషాన్‌1
1/4

పత్తిరైతు పరేషాన్‌

పత్తిరైతు పరేషాన్‌2
2/4

పత్తిరైతు పరేషాన్‌

పత్తిరైతు పరేషాన్‌3
3/4

పత్తిరైతు పరేషాన్‌

పత్తిరైతు పరేషాన్‌4
4/4

పత్తిరైతు పరేషాన్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement