మంటలు! | - | Sakshi
Sakshi News home page

మంటలు!

Oct 8 2025 6:27 AM | Updated on Oct 8 2025 6:27 AM

మంటలు!

మంటలు!

మంత్రులు మాటలు చిచ్చురేపిన వీసీ తీరు?

24 గంటల్లో క్షమాపణ చెప్పాలని అల్టిమేటం

ఖర్గే, మీనాక్షి నటరాజన్‌కు ఫిర్యాదు

జాతిని అవమానించారని అడ్లూరి ఆవేదన

శాతావాహన వీసీ వల్లే

మంత్రుల మధ్యదూరం?

అప్పటి నుంచే చిన్నచూపు చూస్తున్నారంటున్న లక్ష్మణ్‌ వర్గం

ఉమ్మడి జిల్లా మంత్రుల మధ్య బయటపడ్డ విభేదాలు

మంత్రులు మాటలు

ఉమ్మడి జిల్లా నుంచి శ్రీధర్‌బాబు, పొన్నం ప్రభాకర్‌, అడ్లూరి లక్ష్మణ్‌కుమార్‌ మంత్రులుగా ఉన్నారు. ఇంతకాలం శ్రీధర్‌బాబు, పొన్నం ప్రభాకర్‌ వర్గాలమధ్య ఆదిపత్యపోరు నడిచినా.. అది ఏనాడూ బయటపడలేదు. ఇద్దరికీ ఆహ్వానం ఉన్నా.. కలిసి పాల్గొన్న అధికారిక కార్యక్రమాలు తక్కువే. కరీంనగర్‌ జిల్లా కేంద్రంపై రాజకీయ పట్టుకోసం ఇటు పొన్నం వర్గం, అటు శ్రీధర్‌బాబు వర్గం ఎవరి ప్రయత్నాలు వారు చేస్తున్నారు. శాతవాహన వర్సిటీలో జరిగిన ఓ ప్రారంభోత్సవం సందర్భంగా వీసీ వ్యవహరించిన తీరు మంత్రులు పొన్నం ప్రభాకర్‌, అడ్లూరి లక్ష్మణ్‌ మధ్యదూరం పెంచినట్లు సమాచారం. ఇటీవల ఎస్సీ కోటా నిధులతో నిర్మించ తలపెట్టిన ఓ హాస్టల్‌ ప్రారంభోత్సవానికి ముఖ్యఅతిథిగా పొన్నం ప్రభాకర్‌ను పిలిచేందుకు వీసీ ఏర్పాట్లు చేసుకున్నారు. ఈ విషయం తెలుసుకున్న మంత్రి అడ్లూరి వీసీకి ఫోన్‌చేసి తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేశారు. ఎవరి నిధులు? ఎవరు ప్రారంభోత్సవం చేస్తారు? అని గట్టిగా నిలదీశారు. ఈ విషయం పొన్నం వర్గం చెవినపడింది. దీనిని దృష్టిలో పెట్టుకుని తమను చిన్నచూపు చూస్తున్నారని లక్ష్మణ్‌ వర్గం ఆవేదన వ్యక్తం చేస్తోంది. గతంలో వర్సిటీలో జరిగిన కార్యక్రమాలకు మంత్రి అడ్లూరికి షార్ట్‌నోటీస్‌లో ఆహ్వానం పంపడంపైనా లక్ష్మణ్‌ వర్గం వీసీపై గుర్రుగా ఉంది. ఆ మధ్య జరిగిన ఓ కార్యక్రమంలో వేదికపై ఓ నాయకుడిని పొగిడే క్రమంలో ‘బుల్లెట్‌ దిగిందా? లేదా’ అంటూ వీసీ చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశమైన సంగతి తెలిసిందే. త్వరలో జరగబోయే కాన్వొకేషన్‌ కార్యక్రమానికి రాజకీయ నాయకులను పిలవవద్దని తొలుత అనుకున్నా.. వీసీ మాత్రం తన నిర్ణయాన్ని మార్చుకునే పరిస్థితులు కనిపించడం లేదని సిబ్బంది అంటున్నారు.

సాక్షిప్రతినిధి,కరీంనగర్‌ :

టీవల మంత్రి పొన్నం ప్రభాకర్‌ హైదరాబాద్‌లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో మాట్లాడిన మాటలు ఉమ్మడి జిల్లా కాంగ్రెస్‌లో మంటలు రేపుతున్నాయి. జాతిని, తనను కించపరిచారంటూ ఎస్సీ వెల్ఫేర్‌ మినిస్టర్‌ అడ్లూరి లక్ష్మణ్‌కుమార్‌ వీడియో విడుదల చేయడం రాజకీయ ప్రకంపనలు రేపుతోంది. తన జాతిలో పుట్టడం తప్పా? అని ప్రశ్నించారు. 24 గంటల్లో తనకు, తన జాతికి బేషరతుగా క్షమాపణ చెప్పాలని మంత్రి అడ్లూరి అల్టిమేటం జారీచేయడంతో పాత కరీంనగర్‌ రాజకీయాలు వేడెక్కాయి. వాస్తవానికి ఆదివారం జూబ్లీహిల్స్‌లో నిర్వహించిన మీడియా సమావేశంలో ‘మనకు టైం అంటే తెలుసు.. వాడొక దున్నపోతు వాడికేం తెలుసు’ అంటూ అన్న మాటలు సోషల్‌ మీడియాలో వైరలయ్యాయి. దీనిని బీఆర్‌ఎస్‌ సోషల్‌ మీడియా విపరీతంగా వైరల్‌ చేసింది. దీనిపై పొన్నం ప్రభాకర్‌ ఆఫీసు నుంచి వెంటనే ఖండన కూడా వెలువడింది. మంగళవారం మంత్రి అడ్లూరి నేరుగా వీడియో విడుదల చేయడంతో పరిస్థితి ఒక్కసారిగా మారిపోయింది.

ఆయన విజ్ఞతకే వదిలేస్తున్నా..

ఈ విషయమై మంత్రి అడ్లూరిని ‘సాక్షి’ పలకరించగా.. మంత్రి పొన్నం ప్రభాకర్‌ నుంచి ఇలాంటి వ్యాఖ్యలు అసలు ఊహించలేదు. సోషల్‌ మీడియాలో వైరల్‌ అయిన తర్వాత అయినా ఆయన కనీసం ఈ వ్యాఖ్యలపై వివరణ ఇవ్వకపోవడం నన్ను మరింత బాధించింది. పక్కన మరో మంత్రి వివేక్‌కూడా ఉన్నారు. ఆయన కూడా మౌనం వహించడం దురదృష్టకరం. ఈ జాతిలో జన్మించడం నా తప్పా? 24 గంటల్లో నాకు, నా జాతికి భేషరతుగా క్షమాపణ చెప్పాలి. నిజాయతీ కలిగిన కాంగ్రెస్‌ కార్యకర్తగా ఈ విషయాన్ని మా పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జి మీనాక్షి నటరాజన్‌కు ఫిర్యాదు చేశాను. అగ్రనాయకత్వం ఇచ్చే ఆదేశాలకు అనుగుణంగా వ్యవహరించాలని నిర్ణయించుకున్నా.

మంత్రి పొన్నం వ్యాఖ్యలపై మినిస్టర్‌ లక్ష్మణ్‌ ఫైర్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement