
నష్టం వివరాల సేకరణ
క్షేత్రస్థాయి పరిశీలన..
భిక్కనూరులో వరదకు తెగిన దాసనమ్మ కుంట కట్టను పరిశీలిస్తున్న కేంద్ర బృందం
కామారెడ్డి క్రైం: జిల్లాను అతలాకుతలం చేసి వరద మిగిల్చిన నష్టాన్ని కేంద్ర బృందం సభ్యులు క్షేత్రస్థాయిలో పరిశీలించి వివరాలు సేకరించారు. హోమ్ అఫైర్స్ జాయింట్ సెక్రెటరీ పీకే రాయ్ నేతత్వంలోని కేంద్ర ప్రభుత్వ అధికారుల బృందం బుధవారం జిల్లాకు వచ్చింది. భిక్కనూర్ వద్ద కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ వారికి ఘన స్వాగతం పలికారు. భిక్కనూరు, బీబీపేట మండలాల్లో పర్యటించిన అనంతరం కేంద్ర బృందం ప్రతినిధులు జిల్లా కేంద్రానికి చేరుకున్నారు. జీఆర్ కాలనీలో పర్యటించి వరదల కారణంగా ధ్వంసమైన రోడ్లు, దెబ్బతిన్న వంతెనలను పరిశీలించారు. ఫిల్టర్‌బెడ్ వద్ద కాలువ, పంప్‌హౌస్, కాజ్‌వే రోడ్డును పరిశీలించారు. అనంతరం కలెక్టరేట్‌లో ఏర్పాటు చేసిన ఫొటో ఎగ్జిబిషన్‌ను వారు తిలకించగా, కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ జిల్లాలో జరిగిన నష్టాన్ని వివరించారు. ఈ ఏడాది ఆగస్టు 26వ తేదీ నుంచి 28 వరకు 3 రోజుల వ్యవధిలోనే ఏడాది కాలంలో కురిసే సగటు వర్షపాతం(983.4)లో 40 శాతం (339.8 ఎంఎం) కురిసిందన్నారు. జిల్లాలోని రహదారులు, వంతెనలు, పంటలు, చెరువులు, కుంటలు, విద్యుత్ సౌకర్యాలు, ఇళ్లు దెబ్బతినగా, తాత్కాలికంగా అత్యవసర పునరుద్ధరణ పనులు చేపట్టామని కలెక్టర్ వివరించారు. బృందంలో ఎక్పెండీచర్స్ సెంట్రల్ ఫైనాన్స్ శాఖ డిప్యూటీ డైరెక్టర్ మహేశ్‌కుమార్, మినిస్ట్రీ ఆఫ్ జలశక్తి అధికారి శ్రీనివాస్ బైరి, నేషనల్ రిమోట్ సెన్సింగ్ సెంటర్ అధికారి శశివర్ధన్‌రెడ్డి ఉన్నారు.
జిల్లాలో పర్యటించిన కేంద్ర బృందం
వరద మిగిల్చిన నష్టాన్ని
పరిశీలించిన సభ్యులు
జిల్లా కేంద్రంతోపాటు
ఐదు మండలాల్లో పర్యటన
కలెక్టరేట్‌లో ఫొటో ఎగ్జిబిషన్
నష్టం వివరాలను బృందం దృష్టికి
తీసుకెళ్లిన కలెక్టర్ సంగ్వాన్

నష్టం వివరాల సేకరణ