
ఆదర్శం 5.30 బ్యాచ్
ప్రతిరోజూ వస్తాను
రెండేళ్లుగా వస్తున్నా..
ఆరోగ్యం.. సేవాభావం
రామారెడ్డిలో మూడేళ్ల క్రితం ఏర్పాటు
రామారెడ్డి(ఎల్లారెడ్డి): ఆరోగ్య సంరక్షణ ఎంత ముఖ్యమో సామాజిక సేవ సైతం అంతే ముఖ్యమని అంటున్నారు రామారెడ్డి మండల కేంద్రానికి చెందిన ‘5.30 బ్యాచ్’ సభ్యులు. ప్రతి రోజూ తెల్లవారుజామునే వాకింగ్, వ్యాయామం చేసే వారంతా కలిసి 5.30 బ్యాచ్‌ను ఏర్పాటు చేశారు. రామారెడ్డి మైదానంలో ఆరుగురు యువకులు మూడేళ్ల క్రితం 5:30 బ్యాచ్ పేరుతో వాట్సాప్ గ్రూప్‌ను క్రియేట్ చేశారు.
బ్యాచ్ ముఖ్య ఉద్దేశం ఆరోగ్యమే మహాభాగ్యం. ఇద్దరితో మొదలైన బ్యాచ్ 120 మందికి చేరింది. ప్రతిరోజూ ఉదయం 5.30 గంటలకు రామారెడ్డి మైదానానికి గ్రూప్‌లోని యువకులతోపాటు 60 ఏళ్లు పైబడిన వృద్ధులు కూడా చేరుకుని వ్యాయామం చేస్తారు.
సమాజ సేవ
5:30 బ్యాచ్ ఆధ్వర్యంలో ఆరోగ్యమే మహాభాగ్యమంటూనే సమాజ సేవలోనూ పాలుపంచుకుంటున్నారు. స్వచ్ఛభారత్‌ను ముందుకు తీసుకెళ్లి మైదా నంలో అపరిశుభ్రత ఎక్కడున్న శుభ్రపర్చడం. శుభ్రపరచిన చోట మొక్కలు నాటడం వాటిని సంరక్షించడం వారి పని. ఆపదలో ఉన్న వారిని ఆదుకోవడానికి తలాకొంత డబ్బులు పోగుచేసి అండగా నిలుస్తున్నారు. ఇటీవల వరద బాధితలకు జూనియర్ కళాశాలలో ఆశ్రయమివ్వగా.. వారికి ఓ పూట టిఫిన్, రెండు పూటలా భోజనం మూడురోజులపాటు సమకూర్చారు. రామారెడ్డి గ్రామం అంటేనే క్రీడా గ్రామంగా పేరుంది. క్రీడాకారులకు క్రీడాదుస్తులు, అవసరమైన సామగ్రి అందించే బాధ్యతనూ 5.30 బ్యాచ్ తీసుకుంది. అలాగే క్రీడల్లో రాణిస్తున్న వారికి నగదు సాయం చేస్తూ అండగా నిలుస్తున్నారు. మా ఆరోగ్యాన్ని పరిరక్షించుకుంటూనే సమాజానికి తమవంతు సేవ చేస్తున్నామని, మాతో కలిసి రావాలని పిలుపునిస్తున్నారు 5.30 బ్యాచ్ సభ్యులు.
నాకు 63 ఏళ్లు. ప్రతి రోజూ గ్రౌండ్‌కి వస్తాను. వ్యాయామంతోపాటు మైదానం పరిశుభ్రంగా ఉంచేందుకు కృషి చేయడం, ఆపదలో ఉన్న వారికి అండగా నిలవడం ఆనందంగా ఉంది. ఆరోగ్యాన్ని కాపాడుకోవడంతోపాటు సమాజ సేవకు మరింత మంది కలిసి రావాలి. – శివారాం రాజనర్సాగౌడ్
నేటి కాలంలో ఆరోగ్యానికి మించిన ఆస్తి లేదు. అదే ఉద్దేశంతో 5:30 బ్యాచ్‌ను ప్రారంభించి నడిపిస్తున్నందుకు అభినందనీయం. రెండేళ్లుగా ప్రతిరోజూ వచ్చి వ్యాయామం చేస్తున్నా. సభ్యులందరం కలిసి ఆపదలో ఉన్న వారిని ఆదుకుంటున్నాం.
– సామల రాజేశ్వర్
ఆరోగ్యమే మహాభాగ్యం అనే లక్ష్యంతో మూడేళ్ల క్రితం 5:30 బ్యాచ్‌ను స్థాపించాం. వ్యాయామం చేయడంతోపాటు సమాజసేవ చేస్తున్నాం. 120 మంది సభ్యులు ఉన్నారు. తెల్లవారుజామునే గ్రౌండ్‌కు చేరుకుంటాం.
– గురిజకుంట స్వామి
ఆరోగ్య సంరక్షణ..
సమాజ సేవే లక్ష్యం
ఆపదలో ఉన్న వారికి అండగా
నిలుస్తున్న బ్యాచ్ సభ్యులు

ఆదర్శం 5.30 బ్యాచ్

ఆదర్శం 5.30 బ్యాచ్

ఆదర్శం 5.30 బ్యాచ్