
మానవ అక్రమ రవాణ నిర్మూలన అందరి బాధ్యత
కామారెడ్డి రూరల్: మానవ అక్రమ రవాణా నిర్మూలనలో ప్రజలందరూ భాగస్వాములు అయినప్పుడే దానిని సమూలంగా నివారించొచ్చని డీఈవో రాజు అన్నారు. ప్రజ్వల స్వచ్ఛంద సంస్థ, రాష్ట్ర విద్యా పరిశోధన శిక్షణా మండలి సంస్థ ఆధ్వర్యంలో టేక్రియాల్ కేజీబీవీలో నిర్వహిస్తున్న రెండు రోజుల శిక్షణలో భాగంగా బుధవారం నాటి కార్యక్రమంలో ఆయన పాల్గొని మాట్లాడారు. మానవ అక్రమ రవాణా అనేది ప్రపంచ వ్యాప్తంగా అత్యంత వేగంగా విస్తరిస్తూ ఎంతో మంది అమ్మాయిల జీవితాలను నాశనం చేస్తున్న నేరపూరితమైన చర్య అని అన్నారు. ముఖ్యంగా పాఠశాలల్లో నిర్వహించే పేరెంట్స్ మీటింగ్స్ లో అవగాహనా కల్పించాలన్నారు. సైబర్ ట్రాఫికింగ్ అనేది చాలా వేగంగా విస్తరిస్తున్న జఠిలమైన సమస్యఅని, ఫోన్ ఉపయోగించడం ద్వారా కలిగే అనర్థాలను పిల్లలకు వివరించాలన్నారు. ప్రజ్వల, ఫౌండేషన్ రీసోర్స్ పర్సన్లు సంజీవులు, రాములు మాట్లాడుతూ.. తమ సంస్థ ద్వారా ఇప్పటి వరకు 32,000 వేల మంది అమ్మాయిలను, మహిళలను కాపాడామన్నారు. ఎంఈవో ఎల్లయ్య, శ్రీనివాస్, ఉపాధ్యాయకులు, సీఆర్‌పీలు చిరంజీవి, రాము లు, కాళిదాసు తదితరులు పాల్గొన్నారు.