
నాణ్యమైన విద్యనందించాలి
కామారెడ్డి టౌన్: పేద పిల్లలకు నాణ్యమైన విద్యనందించేలా కృషి చేయాలని తెలంగాణ రాష్ట్ర గురుకుల విద్యాలయాల సంస్థ కార్యదర్శి రమణకుమార్ అన్నారు. బుధవారం జిల్లా కేంద్రంలోని నేతాజీ సుభాష్ చంద్రబోస్ ఆవాస విద్యాలయం (అర్బన్ రెసిడెన్షియల్ స్కూల్)ను ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఉపాధ్యాయులకు పలు సూచనలు చేశారు. విద్యార్థుల అభ్యసన సామర్థ్యాలను, ప్రగతిని తెలుసుకున్నారు. ఆవాస పాఠశాలలోని సరుకుల, వంటగదిని, మూత్రశాలలను పరిశీలించారు. విద్యార్థుల హాజరు మెరుగుపడాలని సూచించారు. ఆయన వెంట జిల్లా అకడమిక్ మానిటరింగ్ అధికారి వేణుగోపాల్, కమ్యూనిటీ మొబిలైజేషన్ అధికారి నాగవేందర్ తదితరులు ఉన్నారు.
కామారెడ్డి రూరల్: పత్తి రైతులు కనీస మద్దతు ధర రూ.8,110కి పంట దిగుబడిని విక్రయించుకోవాలనుకుంటే ముందస్తుగా సీసీఐ ‘కపాస్ కిసాన్ యాప్’లో స్లాట్ బుక్ చేసుకోవాలని వ్యవసాయ మర్కెటింగ్ శాఖ హైదరాబాద్ సంయుక్త సంచాలకులు మల్లేశం సూచించారు. యాప్ ద్వారా నిర్ణీత తేదీ, సమయంలో సంబంధిత కాటన్ జిన్నింగ్ మిల్లుకి వెళ్లాలని అన్నారు. బుధవారం జిల్లా కేంద్రంలోని కళాభారతి ఆడిటోరియంలో అవగాహన సదస్సు నిర్వహించారు. పత్తి విక్రయించే సందర్భంలో ఎదురయ్యే సమస్యలు, సందేహాల నివృత్తి కోసం టోల్ ఫ్రీ నంబర్ 18005995779కి రైతులు కాల్ చేయాలన్నారు. కొనుగోలు కేంద్రాల వివరాలు, పత్తి అర్హత, అమ్మకాల వివరాలు, చెల్లింపుల వివరాలు తెలుసుకోవడానికి వాట్సాప్ చాట్ 8897281111 నంబర్‌ను సంప్రదించాలన్నారు. సంబంధిత వ్యవసాయ అధికారులు రైతులకు అవగాహన కల్పించి కనీస మద్దతు ధర లభించే విధంగా చూడాలని కోరారు. డీఏవో గోవింద్, ఏడీలు, ఏఈవోలు, ఏవోలు, మార్కెటింగ్ శాఖ డీఎంవో గంగు, రమ్య, సీసీఐ సీపీవోలు తదితరులు పాల్గొన్నారు.
ప్రజలు ఆర్టీసీ సేవలను
వినియోగించుకోవాలి
ఖలీల్‌వాడి: నిజామాబాద్ ఆర్టీసీ రీజియన్ ఆధ్వర్యంలో దసరా పండుగ సందర్భంగా ప్రయాణికుల కోసం నిర్వహించిన ప్రత్యేక లక్కీ డ్రా విజేతలను సీపీ సాయిచైతన్య ప్రకటించారు. జిల్లా కేంద్రంలోని ఆర్‌ఎం కార్యాలయంలో బుధవారం నిర్వహించిన లక్కీ డ్రా కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. మొదటి బహుమతి చంద్రయ్య (రూ.25 వేలు), ద్వితీయ బహుమ తి షేక్ బాబర్ (రూ.15వేలు), తృతీయ బహుమతి రాంప్రసాద్ (రూ.10 వేలు) అందజేశారు. ఆర్‌ఎం జ్యోత్స్న మాట్లాడుతూ ప్రతి ప్రయాణికుడి సహకారమే సంస్థ విజయానికి మూలాధారమన్నారు. డీఆర్‌ఎం మధుసూదన్ తదితరులు పాల్గొన్నారు.

నాణ్యమైన విద్యనందించాలి