పరిసరాల పరిశుభ్రత పాటించాలి
అలంపూర్: పరిసరాల పరిశుభ్రత పాటించాలని మున్సిపల్ కమిషనర్ శంకర్ అన్నారు. అలంపూర్ మున్సిపాలిటీలోని ఆయా వార్డులో చెత్తను తొలగించే పనులను మున్సిపల్ కమిషనర్ సోమవారం పరిశీలించారు. సోషల్ మీడియా ద్వారా వచ్చిన ఫిర్యాదులకు స్పందించిన మున్సిపల్ కమిషనర్ ఆయా వార్డుల్లో ఉన్న చెత్తాచెదారం తొలగించే పనులు చేపట్టారు. మున్సిపల్ సిబ్బంది చేపట్టిన పారిశుద్ధ్య పనులను పరిశీలించారు. నివాస గృహాలు, ఖాళీ ప్రదేశాల్లో చెత్తను వేయవద్దని సూచించారు. అయితే మున్సిపాలిటీలోని ఆయా వార్డుల్లో చెత్త తరలించే బండ్లు రావడం లేదని, ఒకవేళ వచ్చినా ఉదయం అందరూ పనులకు వెళ్లిన తర్వాత వస్తున్నట్లు మున్సిపల్ కమిషనర్ దృష్టికి తీసుకొచ్చారు.


