
ప్రతిపాదనలు రూపొందిస్తున్నారు..
ఎలివేటెడ్ కారిడార్ నిర్మాణ విషయాన్ని సీఎం రేవంత్‌రెడ్డి కేంద్ర మంత్రి దృష్టికి తీసుకెళ్లగా.. సానుకూలంగా స్పందించారు. ఫ్యూచర్ సిటీ నుంచి ఆకుతోటపల్లి వరకు ఇప్పటికే గ్రీన్ ఫీల్డ్ రహదారి నిర్మాణానికి టెండర్ల ప్రక్రియ పూర్తయింది. ఆకుతోటపల్లి నుంచి బ్రాహ్మణపల్లి వరకు కొత్త గ్రీన్‌ఫీల్డ్ రోడ్డు కోసం అధికారులు ప్రతిపాదనలు సిద్ధం చేస్తున్నారు. ఈ రహదారి నిర్మాణం జరిగితే హైదరాబాద్– శ్రీశైలం మధ్య సుమారు 40 కి.మీ., దూరం తగ్గుతుంది. – వంశీకృష్ణ, ఎమ్మెల్యే, అచ్చంపేట