
విపత్తులను సమర్థవంతంగా ఎదుర్కోవాలి
గద్వాల: విపత్తులు సంభవించినపుడు వాటిని సమర్థవంతంగా ఎదుర్కొనేలా అవసరమైన మాక్ ఎక్సర్‌సైజులను నిర్వహించాలని అదనపు కలెక్టర్ వి.లక్ష్మీనారాయణ అన్నారు. శనివారం ఆయన కలెక్టరేట్‌లోని కాన్ఫరెన్స్ హాలులో జాతీయ విపత్తు ప్రతిస్పందన దళం ఆధ్వర్యంలో సమన్వయ సమావేశం, టేబుల్‌టాప్ వ్యాయమం నిర్వహించారు. కార్యక్రమంలో పాల్గొన్న ఆయన మాట్లాడుతూ ఈనెల 9వ తేదీన అలంపూర్‌లోని తుంగభద్రనది వద్ద ఉదయం 10గంటల నుంచి 1గంట వరకు ప్రధాన మాక్ ఎక్సర్‌సైజ్ కార్యక్రమం నిర్వహించనున్నట్లు తెలిపారు. కార్యక్రమం నిర్వహణకు అవసరమైన చర్యలు తీసుకోవాలని అదేవిధంగా ప్రభుత్వానికి నివేదిక పంపాలన్నాకె. సంబంధిత శాఖల అధికారులు సమన్వయంతో పనిచేసి కార్యక్రమాలను విజయవంతంగా నిర్వహించాలన్నారు. సమావేశంలో ఎన్‌డీఆర్‌ఎఫ్ కమాండెంట్ దామోదర్‌సింగ్,అసిస్టెంట్ కమాండెంట్ ఫాణి, పదవ బెటాలియన్ అసిస్టెంట్ కమాండెంట్ పాల్గొన్నారు.
మాట్లాడుతున్న అదనపు కలెక్టర్ వి.లక్ష్మీనారాయణ