
ప్రముఖుల ప్రత్యేక పూజలు
దసరా వేడుకలలో గద్వాల సంస్థానాధీశుల వారసుడు కృష్ణరాంభూపాల్, ఎమ్మెల్యే కృష్ణమోహన్‌రెడ్డి, మున్సిపల్ మాజీ చైర్మన్ బీఎస్ కేశవ్, బీజేపీ నాయకులు వేర్వేరుగా పాల్గొన్నారు. గురువారం రాత్రి స్థానిక గుంటి చెన్నకేశవస్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం అక్కడే ఉన్న శమీవృక్షం చుట్టూ ప్రదక్షిణలు చేశారు. భక్తులు శమీ వృక్షానికి సామూహికంగా హారతులు సమర్పించారు. అనంతరం శమీవృక్షం చుట్టు ప్రదక్షిణలు చేశారు. స్థానిక పెద్ద ఆగ్రహారంలోని శ్రీలక్ష్మినర్సింహాస్వామి ఉత్సవమూర్తుల మహా రథోత్సవం వైభవంగా సాగింది.