
దుర్గామాత నిమజ్జనోత్సవం
లోకాలను కాపాడే లోకపావనీ.. నీకు వీడ్కోలు అంటూ దుర్గామాతాను కొలిచారు. దేవీ శరన్నవరాత్రుల్లో విశేష పూజలందుకున్న దుర్గామాత నిమజ్జనోత్సవం జిల్లా కేంద్రంలో గురువారం రాత్రి కనులపండువగా. స్థానిక బాలాజీ వీధిలో ఆరెకటిక సంఘం, రాంనగర్ రామాలయం, తెలుగుపేట శివాలయం, ఆర్యవైశ్య సంఘం, శాలివాహన సంఘం ఆధ్వర్యంలో నెలకొల్పిన దుర్గామాతల విగ్రహాలను రాత్రి ఊరేగించారు. ఈ సందర్భంగా డప్పుమేళాలతో నృత్యాలు చేసుకుంటూ అమ్మవారిని తరలించారు. ఆయా ఆలయాల నిర్వాహకులు చేపట్టిన అమ్మవారి శోభయాత్రలో వాయిద్యకారులు ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. ప్రతిమల రథాలకు మహిళలు ఎదురుగా వచ్చి మంగళ హారతులతో స్వాగతం పలికారు. అమ్మవారి నిమజ్జనోత్సవం ప్రతిమ ముందు చిన్నారుల సాంస్కృతిక కార్యక్రమాలు అలరించాయి. పెద్ద ఎత్తున బాణసంచా కాల్చారు. అనంతరం కృష్ణానదిలో అమ్మవారిని నిమజ్జనం చేశారు.
నవధాన్యాల మొలకల నిమజ్జనం
గట్టు: విజయ దశమి వేడుకల్లో భాగంగా గట్టులోని భవాని ఆలయం పక్కనే ఉన్న శేషంబావిలో నవధాన్యాల మొలకలను నిమజ్జనం చేశారు. దేవీ నవరాత్రుల్లో భాగంగా గట్టులోని ఎప్‌ఎస్‌కే సమాజ్ తొమ్మిది రోజుల పాటు నియమ నిష్టలతో నవ ధాన్యాల మొలకలను పెంచి, విజయ దశమి పండుగ రోజున గ్రామంలో ఊరేగింపు నిర్వహించారు. భవాని ఆలయం పక్కనే ఉన్న పూరాతన కాలం నాటి శేషంబావిలొ నవధాన్యాల మొలకలను నిమజ్జనం చేశారు.

దుర్గామాత నిమజ్జనోత్సవం