
స్థానిక సంస్థల ఎన్నికలకు సిద్ధం కావాలి
గట్టు: త్వరలోనే జరగబోయే స్థానిక సంస్థల ఎన్నికలకు సిద్ధం కావాలని కార్యకర్తలకు ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్‌రెడ్డి పిలుపునిచ్చారు. శుక్రవారం గట్టులో కార్యకర్తల సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ గ్రామాలు అభివృద్ధి చెందాలంటే స్థానిక సంస్థల ఎన్నికల్లో తాము బలపరచిన అభ్యర్థులను గెలిపించాలని కోరారు. త్వరలోనే స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించనున్నట్లు వివరించారు. గ్రామాల రిజర్వేషన్ల ఆధారంగా ప్రతి ఒక్కరికి పోటీ చేసే అవకాశం కల్పించనున్నట్లు, స్థానిక సంస్థల ఎన్నికల్లో వర్గవిభేదాలను వీడి కలిసికట్టుగా పని చేయాలన్నారు. కార్యక్రమంలో పీఏసీఎస్ అధ్యక్షుడు వెంకటేష్, మాజీ ఎంపీపీ విజయ్‌కుమార్, మాజీ సర్పంచు మోహన్‌గౌడు, నాయకులు రామన్‌గౌడు, రామకృష్ణారెడ్డి, గద్వాలతిమ్మప్ప,మాచర్ల అలి,రాయాపురం రాముడు తదితరులు పాల్గొన్నారు.