
గాంధీజీ జీవితం అందరికీ ఆదర్శం
గద్వాలటౌన్: అహింసా మార్గంలో దేశానికి స్వాతంత్య్రం తెచ్చిన ఘనత గాంధీజీకి మాత్రమే సాధ్యమైందని.. సన్మార్గంలో ప్రయాణిస్తూ నమ్మిన సిద్ధాంతాలు, విలువలను నిబద్ధతతో ఆచరించడంతో గాంధీజీ కీర్తి ప్రతిష్టలు విశ్వవ్యాప్తమయ్యాయని పలువురు ప్రముఖులు పేర్కొన్నారు. మహాత్మాగాంధీ జయంతి వేడుకలను గురువారం గద్వాలలో ఘనంగా నిర్వహించారు. గాంధీచౌక్‌లోని గాంధీజీ విగ్రహానికి వివిధ రాజకీయ పార్టీల నేతలు, అధికారులు, పలు సంఘాల నాయకులు వేరువేరుగా పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. కాంగ్రెస్ పార్టీలో ఎమ్మెల్యే వర్గం, జెడ్పీ మాజీ చైర్‌పర్సన్ వర్గాలకు చెందిన నాయకులు వేర్వేరుగా గాంధీ జయంతిని నిర్వహించారు. స్థానిక చింతలపేటలో ఉన్న గాంధీజీ విగ్రహానికి ఎమ్మెల్యే కృష్ణమోహన్‌రెడ్డి పూలమాలలు వేసి నివాళులర్పించారు. స్వాతంత్య్రోద్యమ కాలంలో సాంఘిక, ఆర్థిక విషయాలను జోడించి పోరాడిన మహోన్నత వ్యక్తి అని ఆయన కొనియాడారు. సరిత వర్గానికి చెందిన పలువురు నాయకులు సైతం గాంఽధీచౌక్‌లో ఉన్న గాంధీ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.
● బీఆర్‌ఎస్ ఆధ్వర్యంలో గాంఽధీ చౌరస్తాలో ఉన్న గాంధీజీ విగ్రహానికి మున్సిపల్ మాజీ చైర్మన్ బీఎస్ కేశవ్, హనుమంతునాయుడు పూలమాలలు వేసి నివాళులర్పించారు.
● బీజేపీ ఆధ్వర్యంలో గాంధీజీ విగ్రహానికి పార్టీ జిల్లా అధ్యక్షుడు రామంజనేయులు పూలమాల వేసి నివాళులర్పించారు.
● గద్వాల ఆర్యవైశ్య సంఘం, వాసవి క్లబ్, ఆవోపా నేతలు గాంధీజీ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. గాంధీ సేవలు కొనియాడారు. వీరితో పాటు పలు ఉపాధ్యాయ, ఉద్యోగ, విద్యార్థి, ప్రజాసంఘాల నాయకులు గాంధీ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. నడిగడ్డ హక్కుల పోరాట సమితి ఆధ్వర్యంలో గాంధీ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు.