
ఎస్పీ కార్యాలయంలో ఆయుధ పూజ
గద్వాల క్రైం: విజయదశమిని పురస్కరించుకొని జిల్లా సాయుధ దళ కార్యాలయంలో మంగళవారం ఎస్పీ శ్రీనివాసరావు ఆయుధ పూజ సతీసమేతంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ.. చెడుపై మంచి సాధించిన విజయానికి గుర్తుగా విజయదశమి పండుగను నిర్వహించడం ఆనవాయితీగా వస్తుందన్నారు. సమాజంలో చెడును నిలువరించేందుకు పోలీసుశాఖ చర్యలు తీసుకుంటుందని తెలిపారు. అంతకముందు జిల్లా పోలీస్ శాఖకు సంబంధించిన ఆయుధాలు, వాహనాలకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. జిల్లా ప్రజలు, సిబ్బందికి ఎస్పీ ముందుస్తు పండుగ శుభాకాంక్షలు తెలిపారు. కార్యక్రమంలో డీఎస్పీలు మొగిలయ్య, నరేందర్‌రావు, సీఐలు శ్రీను, రవిబాబు, టాటబాబు, ఆర్‌ఐలు సిబ్బంది తదితరులు ఉన్నారు.
1,259 ఎకరాల్లో వరిపంట నష్టం
కృష్ణా: కృష్ణా, భీమానది పరీవాహక ప్రాంతాల్లో వరదల కారణంగా మండలంలో 1,259 ఎకరాల వరిపంటకు నష్టం వాటిల్లిందని జిల్లా వ్యవసాయ అధికారి జాన్‌సుధాకర్ తెలిపారు. మంగళవారం మండల వ్యవసాయ అధికారి సుదర్శన్‌గౌడ్, వ్యవసాయ సిబ్బందితో కలిసి పంటలను పరిశీలించి మాట్లాడారు. మండలంలో వరి, పత్తి పంట కూడా దెబ్బతిందని.. రెండు పంటల నష్టం వివరాల పూర్తి నివేదిక తయారు చేస్తున్నట్లు వివరించారు.